ఒకే ఇంటికి రెండు నంబర్లా ..?

ఒకే ఇంటికి రెండు నంబర్లా ..? - Sakshi


⇒ గరం గరంగా మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం

⇒ కార్మికుల వేతనాల అంశంపై సభ్యుల బైఠాయింపు

⇒ తక్షణమే టెండర్‌ నిర్వహించాలని సీపీఎం, టీడీపీ, బీజేపీ డిమాండ్‌

⇒ అక్రమాలపై నిలదీత




నల్లగొండ టూటౌన్‌ : మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలపై పాలకవర్గ సభ్యులు అధికారులపై గరం గరం అయ్యారు. ఒకే ఇంటికి రెండు నెంబ ర్లు ఇచ్చి మున్సిపాలిటీ ఆదాయానికి కుచ్చుటోపి పెడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మిర్యాల యాదగిరి డిమాండ్‌ చేశారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్‌ అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు.


గతనెల ‘సాక్షి’లో ‘ఒకే ఇంటి కి రెండు నెంబర్లు’ అనే శీర్షికన  ప్రచురితమైన కథనంపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రకాశం బజార్‌ షాపులపై 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీడీఎంఏ హామీ ఇచ్చినా నేటికి అతీగతీ లేదన్నారు. ట్రాక్టర్లలో చెత్త గాలికి రోడ్లు, జనంపైనే పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. గతంలో సస్పెండైన ఉద్యోగుల నుంచి ఎంత డబ్బు రావాలి?, ఎంత రీకవరి చేశారు?, ఇంకేంత రావల్సి ఉంది?, ఎందుకు రికవరీ చేయడం లేదని అధికారులను నిలదీశారు.


ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల వేతన బకా యిలపై సీపీఎం, టీడీపీ, బీజేపీ, స్వతంత్ర సభ్యులు నిరసన తెలిపి చైర్‌పర్సన్‌ వేదిక ముం దు బైఠాయించారు. దాంతో చైర్‌పర్సన్‌ లక్ష్మీ శ్రీనివాస్, కమిషనర్‌ రాజేందర్‌కుమార్‌ జోక్యం చేసుకుని కార్మికులకు వేతనాలను గురువారంలోగా అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళ న విరమించారు. జీఎస్‌ఐ సర్వే పూర్తి కాకుం డానే సంబంధిత కాంట్రాక్టర్‌కు రూ.20 లక్షలు చెల్లించడం వెనుక ఉన్న మతలబు ఏంటని టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ అభిమన్యు శ్రీనివాస్, బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ నూకల వెంకట్‌నారాయణరెడ్డి, టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ మిర్యాల యాదగిరి, సీపీఎం ఫ్లోర్‌ లీడర్‌ ఎండి.సలీం అధికారులను ప్రశ్నించారు.


సర్వే సరిగా చేయడంలేదని గత కౌన్సిల్‌లో స్వయంగా కొంతమంది కౌన్సి లర్లే అధికారుల దృష్టికా తెచ్చినప్పటికీ రూ.20 లక్షలు ఎలా చెల్లి స్తారన్నారు. ఎల్‌ఈడీ లైట్లు వేసే వరకు ఉన్న లైట్లకు మరమ్మతులు చేయాలని బీజేపీ కౌన్సిలర్‌ రావు ల శ్రీనివాస్‌రెడ్డి అధికారులను కోరారు. 16వ వార్డుకు చెత్త ట్రాక్టర్‌ రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ట్రాక్టర్‌ పంపించి వార్డు ప్రజల సమస్య పరిష్కరించాలని ఆ వార్డు కౌన్సిలర్‌ అబ్బగోని కవిత తెలిపారు.


చైర్‌పర్సన్‌ లక్ష్మి మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య ఏర్పడకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. ఎక్కడ నీటి సమస్య ఏర్పడినా వెంటనే పరిష్కరిస్తామని, పట్టణ అభివృద్ధికి అందరూ సహకరించాల న్నారు. అనంతరం ఏజెండా అంశాలను ఆమోదించినట్లు చైర్‌పర్సన్‌ ప్రకటించారు. సమావేశంలో స్వతంత్ర సభ్యుడు జయప్రకాశ్, ఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ అహ్మద్‌ కలీం, కౌన్సిలర్లు మొరిశెట్టి సత్యనారాయణ, బొజ్జ నాగరాజు, పిల్లి సత్యవతి, మొయిన్, ఆలకుంట్ల నాగరత్నంరాజు, ఖయ్యుంబేగ్, మారగోని నవీన్‌కుమార్, ఎండ్ల గీత, తక్కెళ్ల హారిక, దుబ్బ అశోక్‌సుందర్, మెరుగు కౌసల్య, కేసాని కవిత పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top