దర్శనానికి వెళ్తూ..

దర్శనానికి వెళ్తూ.. - Sakshi


ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న పాల లారీ

మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి




ముంగళిపట్టు(చంద్రగిరి): కాణిపాకంకు వెళ్దాం..గణపయ్యను దర్శించుకుందామని ఎంతో సంబరబడ్డారు. భార్య పిల్లలతో కలసి బైక్‌పై కాణిపాకంకు పయనమయ్యారు. కుటుంబంతో ఎంతో సంతోషంగా పయనమైన వారి ఆనందం కనీసం గంటసేపు అయినా వారికి దక్కలేదు. ఒక్కసారిగా వారిని పాల లారీ రూపంలో మృత్యువు కబళించింది. దీంతో ఆ ఇంట విషాదం నెలకొంది. భాదితుల వివరాల మేరకు... తిరుపతి రూరల్ మండల పుదిపట్ల అరుందతీ వాడకు చెందిన నాగార్జున(27) తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.



సోమవారం నైట్ డ్యూటీ ముగించుని మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలసి కాణిపాకంకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుందామని వారు పయనమయ్యారు. ఇంతలో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి ముంగళిపట్లు సమీపంలో వెళ్తున సమయంలో తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్తున్న దొడ్డడైరీ పాల లారీ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి ద్విచక్రా వాహనాన్ని ఢీ కోట్టింది ఈ ప్రమాదంలో నాగార్జున భార్య నీలిమ(26) తలకు తీవ్ర గాయమవ్వడంతో అక్కడిక్కడే మృతి చెందగా, నీలిమ వడిలో ఉన్నటువంటి  ఏడాదిన్నర వయస్సు గల తన చిన్న కుమార్తె కోమలి రోడ్డుపై పడటంటో చిన్నారి తలకు తీవ్ర గాయమైంది.



దీంతో కోమలిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో చిన్నారి మృతి చెందింది. తన పెద్ద కుమార్తె చైత్ర(03) వాహనంలో మధ్యలో కూర్చోవడంతో ఎటువంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడింది.  రోడ్డు ప్రమాదం సమాచారం తెలుసుకున్న అందుకున్న సీఐ శివప్రసాద్, ఎసై్స జయచంద్రలు సంఘటనా స్థలానికి చే రుకుని నీలిమా మృతదేహాన్ని వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



దర్శనానికి వెళ్లొస్తాము అమ్మమ్మా అంటూ ముద్దు ముద్దుగా చెప్పిన మనుమరాలు ఇలా విగతజీవిగా  వచ్చిందా అంటూ నీలిమ బంధువులు ఆర్తనాదాలు తిరుపతి రుయా ఆసుపత్రి ప్రాంగణంలో మార్మోగాయి. నీలిమ, చిన్నారి కోమలి మృతిచెందారని తెలుసుకున్న, అరుందతీ వాడ విషాదంతో మూగబోయింది.



రక్షించిన హెల్మెట్‌

తన కుటుంబంతో కలసి కాణిపాకం వెళ్తున్న సమయంలో నాగార్జున హెల్మెట్ ధరించడంతో చిన్నపాటి గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రమాదంలో జరిగిన సమయంలో నాగార్జున హెల్మెట్ ధరించకుండా ఉంటే అతను తీవ్ర గాయాలపాలైయేవాడని, హెల్మెట్టే అతనిని రక్షించిందని స్థానికులు వాపోతున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top