ఆగని మృత్యు కేక

ఆగని మృత్యు కేక

  • కాళ్లవాపు వ్యాధితో మరొకరు మృతి 

  • చికిత్సపై  అశ్రద్ధతోనే...పదకొండుకు చేరిన మరణాల సంఖ్య

  •  

    కాళ్లవాపు ... వ్యాధి ఏమిటో తెలియదు. – ఎందుకు వస్తుందో నిర్ధారణ కావడం లేదు. తమ పనులు తాము చేసకుంటూనే హఠాత్‌ మరణాలు. చోటుచేసుకోవడంతో ఆ కుంటుబాల్లో విషాదం. మెరుగైన చికిత్స కోసం పెద్దాసుపత్రికి తీసుకువెళ్లినా నిలవని ప్రాణాలు. దీంతో మెరుగైన చికిత్సకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించినా నిరాకరిస్తున్న రోగులు. దీంతో చావును చేజేతులా కొని తెచ్చుకుంటున్నారు. వరుస మరణాల సంఖ్య పదకొండుకు చేరుకుంది.

     

    వీఆర్‌పురం : 

    వీఆర్‌పురం మండలంలో వెలుగుచూసిన కాళ్లవాపు వ్యాధి చింతూరు, కూనవరం మండలాలకు విస్తరించి మరణ మృదంగాల విషాద ధ్వనులు వినిపిస్తునేఆగని మృత్యుకేక ఉన్నాయి. వ్యాధి నివారణ మాట దేవుడెరుగు ... కనీసం ఎందుకు వస్తుందో ... ఏ విధంగా సోకుతుందో ... మరణాలకు కారణాలేమిటో ... ఏ వైద్య చికిత్సలు అందించాలనే విషయాలపై వైద్యుల్లోనే గందరగోళం నెలకుంది. వంటసారా తాగడం వల్లనే మరణిస్తున్నారని జిల్లా అధికారులు ఓ దశలో ప్రకటించడంతో పెద్ద దుమారమే చెలరేగింది, పసి పిల్లలు దగ్గర నుంచి విద్యార్థుల వరకూ మృత్యువాత పడుతున్నారని, వారు కూడా కాపుసారా తాగే చనిపోతున్నారా అని విమర్శలు వచ్చాయి. కాకినాడలోని జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లినా వ్యాధి కోరల్లోనుంచి బయటపడలేక అసువులుబాయడంతో ఈ వ్యాధి ఉన్నవారు కూడా దూరంగా ఉంటున్నారు. వీఆర్‌పురం మండలంలోని చినమట్టపల్లి  గ్రామానికి  చెందిన సోడె కిష్టయ్య(45)కూడా గత నెలలో ఈ వ్యాధి ప్రభావానికి గురై భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. 

     

    చికిత్సకు సహకరించి ఉంటే బతికి ఉండేవాడు..

    చినమట్టపల్లి గ్రామంలో గత నెల 21వ తేదీన వైద్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింట సర్వేలో సోడె కృష్ణయ్యకు కాళ్లవాపు లక్షణాలున్నట్లు  సిబ్బంది గుర్తించారు. అతడిని చికిత్స కోసం కాకినాడ తరలించేందుకు అధికారులు ఏర్పట్లు చేసినప్పటికీ అతడు మాత్రం భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. రెండు రోజుల అనంతరం అతడికి కాళ్లవాపు తగ్గిపోవండతో యథావిథిగా వ్యవసాయ పనులకు వెళ్లాడు. శనివారం ఉదయం గ్రామంలోని ఉపాధి పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతడి భార్య లాలమ్మ , కుమారై శశిరేఖలు ఆటోలో రేఖపల్లి పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని, ఏరియా ఆస్పత్రికి  తరలించాలని అక్కడి వైద్యులు సూచించగా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. అప్పుడే అందరితోపాటుగా కాకినాడ వెళ్లి చికిత్స చేయించుకుని ఉంటే తన భర్త బతికేవాడని కిష్టయ్య భార్య లాలమ్మ బోరున విలపిస్తోంది.

     

    ఊపిరితిత్తుల వ్యాధి కారణంగానే

    ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి మూలంగానే కిష్టయ్య మృతి చెందాడు. అతడిని శనివారం సాయంత్రం రేఖపల్లి పీహెచ్‌సీకి తీసుకు వచ్చారు.అప్పటికే అతడి పరిస్థితి విషంగా ఉంది. డ్యూటీ డాక్టర్‌ పరీక్షించి ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. గత నెలలో నిర్వహించిన ఇంటింటి సర్వేలో కిష్టయ్యకు కూడా కాళ్లవాపు లక్షణాలు న్నట్లు గుర్తించి, అతడిని చికిత్సకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినా సహకరించలేదు. వ్యాధి ప్రభావానికి గురై  కాకినాడ ఆస్పత్రికి వెళ్లి› చికిత్స చేయించుకు వచ్చిన వారందరూ ఆరోగ్యంగా  ఉన్నారు.

    – ఎ.రామారావు, సీనియర్‌సివిల్‌ సర్జన్, కూనవరం సీహెచ్‌సీ

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top