రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం


 నాగారం: వేర్వేరుమ రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. పర్సాయపల్లి గ్రామానికి చెందిన బైరబోయిన జానయ్య (60) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం పర్సాయపల్లి గ్రామం నుంచి సైకిల్‌పై డికొత్తపల్లి గ్రామానికి పని నిమిత్తం వెళుతున్నాడు. ఈ క్రమంలో జనగాం రోడ్డువైపు నుంచి సూర్యాపేటకు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకుని ఘటన స్థలాన్ని ఎస్‌ఐ మోహన్‌రెడ్డి పరిశీలించారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 

 

 గుర్తు తెలియని వాహనం ఢీకొని..

 వల్లభాపురం(చివ్వెంల) :మండల పరిధిలోని పాశ్యా నాయక్‌తండా ఆవాసం బద్యాతండాకు చెందిన భానోతు మోతిరాం(28) వల్లభాపురం గ్రామ శివారులోని అమరావతి హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఈక్రమంలో రోజు మాదిరగానే పనులు ముగించుకుని ఇంటికి వచ్చే క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోరుుంది. తీవ్రంగా గాయడిన మోతి రాంను స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి సోదరుడు హతీరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మృతుడు అవివాతుడు.

 

 బైక్‌పై నుంచి పడి రైతు.. 

 సంస్థాన్ నారాయణపురం: మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన మర్ల శ్రీరాములు(36) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వరిమళ్లను సిద్ధం చేసేందుకు గానూ దున్నకాల కోసం ట్రాక్టర్ తీసుకురావడానికి ఆదివారం సాయంత్రం జనగాం గ్రామానికి వెళ్తుండగా, మార్గమధ్యలో బైకు అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో, చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి  మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top