బాధ్యులను అరెస్టు చేయాలి

బాధ్యులను అరెస్టు చేయాలి - Sakshi


ఆర్మూర్‌ : దళిత యువకులు తలారిసత్యం, చేపూర్‌ రవిల మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని రాజ కీయ, ప్రజా సంఘాల, దళిత సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు సావె ల్‌ గంగాధర్‌ డిమాండ్‌ చేశారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా మృతి చెందారన్నారు. తన కొడుకు తలారి సత్యంను ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్య చే యించారని ఆరోపిస్తూ మృతుని తండ్రి తలారి గంగాధర్‌ అలియాస్‌ బక్కన్న పట్టణంలోని తహసీల్‌ కార్యాలయం ఎదుట సోమవారం ప్రారంభించిన నిరసన దీక్షను మంగళవారం జేఏసీ నాయకుడు గంగాధర్‌ విరమింపజేశారు. అంతకు ముందు రాజకీయ, ప్రజా, దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని తహసీల్‌ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్, మామిడిపల్లి చౌరస్తా మీదుగా అంబేద్కర్‌ చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ చౌరస్తాలో మానవ హారంగా ఏర్పడి ధర్నా చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.



ధర్నాలో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసి జిల్లా నాయకుడు ప్రభాకర్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారాం యాదవ్, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కంచెట్టి గంగాధర్, సీపీఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి గంగాధరప్ప, అంబేద్కర్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు కోటేశ్వర్‌రావులు మాట్లాడుతూ తలారి సత్యం, రవిల మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల  ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నిరసన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ పీసీ భోజన్న, పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గంగామోహన్‌ చక్రు, నర్మె నవీన్, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు దాసు, ముత్తెన్న, టీడీపీ నాయకులు దేగాం యాదగౌడ్, నర్సింహారెడ్డి, సీపీఐ నాయకులు ఆరేపల్లి సాయిలు, నిఖిల్, సీపీఎం నాయకులు వెంకటేశ్, ఎల్లయ్య, అంబేద్కర్‌ సంఘం నాయకులు సదాశివ్, అరుణోదయ కళాకారులు సూరిబాబు, సురేందర్, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top