ఇదీ మన వైద్యం!


- రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సాధించిన జిల్లాలోని ఫస్ట్‌ రిఫరల్‌ సెంటర్లు


- అసలు అర్హతే సాధించలేక పోయిన 7 సామాజిక ఆరోగ్య కేంద్రాలు 


–  కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడి 


 


ఒంగోలు సెంట్రల్‌:   జిల్లాలోని ఫస్ట్‌ రిఫరల్‌ సెంటర్స్‌.. 8వ ర్యాంకు సాధించినట్లు కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమై మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2015–16కు సంబంధించి జిల్లాలోని 15 సామాజిక ఆరోగ్య కేంద్రాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా గ్రేడ్లను కేటాయించారు. ఇందులో 7 కేంద్రాలు కనీస అర్హత సాధిం^è కపోవడం గమనార్హం. వీటిలో గైనకాలజిస్టు, మత్తు వైద్యుడు, చిన్నపిల్లల వైద్యుడు లేకపోవడంతో మాతా, శిశు వైద్యసేవలకు ప్రాంతీయ వైద్యశాలలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆయా ఆస్పత్రుల్లో సేవలు, ప్రమాణాలు, వైద్యులు, సిబ్బంది, అందుబాటులో ఔషధాలు, 24 గంటల ప్రసూతి సేవలు తదితర వివరాలను క్రోడీకరించి ర్యాంకులు నిర్ణయించారు. వార్డులు, థియేటర్‌ వంటి వసతులతో కూడిన ర్యాంకుల ఆధారంగానే జాతీయ ఆరోగ్య పథకం కింద జిల్లాలకు నిధులు కేటాయిస్తారు. అర్హత సాధించని సామాజిక ఆరోగ్య కేంద్రాలకు 5 శాతం దాకా కోత విధించే అవకాశం ఉంది. మంచి ర్యాంకులు సాధిస్తే అదనంగా 5 శాతం ఇస్తారు.


ఒక్క వైద్యుడూ లేడు.. 

ఫస్ట్‌ రిఫరల్‌ సెంటర్స్‌లో చాలావరకు ఒక వైద్యుడు కూడా లేడని తెలిసింది. 30 పడకలుండే సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో గైనకాలజిస్టు, చిన్నిపిల్లల వైద్య నిపుణుడు, మత్తు వైద్యుడు, ఒక డెంటిస్ట్, ఒక ఎంబీబీఎస్‌ ఉండాలి. కానీ చాలా చోట్ల మూడు స్పెషలిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో గిద్దలూరు, కనిగిరి, కంభం, అద్దంకి, దర్శి, చీమకుర్తి, పొదిలి, యర్రగొండ పాలెం, దోర్నాల, కొండపి, ఉలవపాడు,మార్టూరు, పర్చూరు, పామూరు, ఒంగోలు మాతా శిశు వైద్యశాలలు సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రాల కిందకు వస్తాయి. అయితే యర్రగొండపాలెం, దోర్నాల, కొండపి, ఉలవపాడు, మార్టూరు, పర్చూరు, పామూరు తదితర సామాజిక ఆరోగ్య కేంద్రాలు అసలు ర్యాంకింగ్‌కు అర్హత సాధించలేని జాబితాలో చేరాయి. ఉలవపాడు, పర్చూరు సామాజిక ఆరోగ్య కేంద్రాల భవనాలు కుంగి పోయాయి.

నూతనంగా చేరాయి, డాక్టర్‌ దుర్గాప్రసాద్, ఏపీవీవీపీ జిల్లా సమన్వయకర్త

జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో గత సంవత్సరం అందించిన సేవలకు రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు వచ్చింది. అయితే దీనిని మరో సారి సమీక్షించి ర్యాంకులను ఇస్తామని అధికారులు తెలిపారు. అర్హత సాధించలేని 7 కేంద్రాలు నూతనంగా జిల్లా ౖÐð ద్య ఆరోగ్యశాఖ నుంచి తమ శాఖ పరిధిలోకి వచ్చాయి.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top