మాట తప్పితే పుట్టగతులుండవు


  • మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

  • వరంగల్‌ : ఎన్నికల సందర్భంగా అర్హులైన వారికి డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అవగాహన లేకుండా అన్నామని మాట మార్చిన సీఎం కేసీఆర్‌కు పుట్టగతులు ఉండవని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. హన్మకొండ వడ్డేపల్లిలోని ఆయన స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో సాధ్యం కాని హామీలు ఇచ్చి నేడు సాధ్యం కావడం లేదనడం దారుణమన్నారు. భారీ వర్షాలతో రైతుల పంటలు నీట మునిగాయని, పంట నష్టం అంచనాలు వేయడంలో జిల్లా యంత్రాంగం, వ్యవసాయ విఫలమైందని ఆరోపించారు. దేవాదుల ఎయిర్‌ వాల్యూలతో రామప్పను నింపితే నెలలు గడిచినా గరిష్ట స్థాయికి నీటి మట్టానికి చేరుకోదని, అదే ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలతో నింపితే కేవలం 10రోజుల్లోనే పూర్తి స్థాయి నీటిమట్టానికి రామప్ప చేరుకుంటుందన్నారు. ఏటూరునాగారంలో అన్ని అనుమతులు ఇచ్చినా కంతనపల్లి ప్రాజె క్టు నిర్మాణం తూపాకులగూడెం వద్దకు మార్చ డం కేవలం కేసీఆర్‌ తన మార్కు చూపించుకోవడానికేనని ఎద్దేవా చేశారు. మాల్లాడి రాంరెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, నర్సింగరావు, నరేందర్‌రెడ్డి, భిక్షపతి, వీసం సురేందర్‌రెడ్డి,  మహేందర్‌  తదితరులు పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top