ఉద్యమ విజయం

ఉద్యమ విజయం - Sakshi

- సర్కారుకు చెంపపెట్టుగా దేవరపల్లి ఘటన

- దళితుల భూముల విషయంలో వెనక్కి తగ్గిన టీడీపీ ప్రభుత్వం

తొలుత భూములు ప్రభుత్వానివేనన్న రెవెన్యూ ఉన్నతాధికారి

ఆనక భూములను లాక్కున్న అధికార పార్టీ నేతలు

నీరు–చెట్టు పేరుతో అడ్డగోలు తవ్వకాలు

ప్రత్యక్ష పోరాటానికి దిగిన వైఎస్సార్‌ సీపీ, వామపక్షాలు

విధిలేని పరిస్థితుల్లో చంద్రబాబు సర్కారు వెనకడుగు

- దేవరపల్లిలో పర్యటించిన సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు

- దళితులకే భూములు అప్పగిస్తున్నట్టు ప్రకటన 

ప్రభుత్వ వైఖరితో తలలు పట్టుకుంటున్న ఉన్నతాధికారులు

 

దేవరపల్లి భూముల వ్యవహారం చంద్రబాబు సర్కారుకు చెంపపెట్టులా మారింది. ప్రభుత్వానివేనంటూ దళితుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్న అధికార పార్టీ నేతలు వాటిల్లో అడ్డగోలు తవ్వకాలు చేపట్టారు. దీనిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు వామపక్షాలు, ప్రజాసంఘాలు ప్రత్యక్ష పోరాటానికి దిగడంతో సమస్య ఢిల్లీ స్థాయికి చేరింది. దీంతో బెంబేలెత్తిన రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి తగ్గింది. సోమవారం దేవరపల్లిని సందర్శించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు ఆ భూములను దళితులకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. తవ్వకాలు చేపట్టిన భూములను రెవెన్యూ అధికారులు చదును చేసి ఇస్తారని ప్రకటించడం గమనార్హం. మొత్తంగా దేవరపల్లి ఘటన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును తలెత్తుకోలేకుండా చేయగా.. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులకు ఓ గుణపాఠమైంది. 

 

ఆ పార్టీ ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. జూలై 16న దేవరపల్లిని సందర్శించేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సిద్ధమవ్వగా ముందు రోజు రాత్రే బాలినేని పోలీసులు ఒంగోలులోని ఆయన స్వగృహంలో గృహనిర్భంధం చేశారు. జిల్లావ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, ముఖ్యనేతలతో పాటు వామపక్షాల నేతలను నిర్భంధించటంతో పాటు కొందరిని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. జూలై 20న దేవరపల్లి దళితులతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలను సైతం అర్థరాత్రే పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్‌లు చేశారు. ఆ తర్వాత రాత్రంతా 18 మిషన్లు పెట్టి దళితుల భూముల్లో దౌర్జన్యంగా కట్టలు పోశారు. జిల్లా రెవెన్యూ అధికారితో పాటు స్థానిక అధికారులు ఇందుకు సహకరించారు. ఆ తర్వాత 20వ తేదీన వైఎస్సార్‌సీపీ నేతలు బాలినేని, వై.వి.సుబ్బారెడ్డిలు, ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్, పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జునలతో పాటు నేతలు, కార్యకర్తలు దేవరపల్లికి చేరుకున్నారు. అధికార పార్టీ దౌర్జన్యంగా ఆక్రమించుకున్న దళితులను భూములను సందర్శించారు.



దళితుల భూములు వారికి ఇప్పించే వరకు పోరాటం సాగిస్తామని హామీ ఇచ్చారు. సమస్యను రాష్ట్ర స్థాయితో పాటు ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు జరిగిన ఘటనను వివరించారు. దీంతో చంద్రబాబు సర్కారు వెనక్కి తగ్గింది. దళితులకు అన్యాయం జరగనివ్వమంటూ పది రోజుల తర్వాత అధికార పార్టీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కారు. మంత్రి నక్కా ఆనందబాబుతో పాటు మరికొందరు నేతలను దేవరపల్లికి పంపారు. ఇది జరిగిన వారం రోజుల తర్వాత సోమవారం దేవరపల్లిని సందర్శించిన మంత్రి దళితుల భూములు వారికే అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. దేవరపల్లి ఘటన చంద్రబాబు సర్కారుకు చెంపపెట్టులా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్‌సీపీతో పాటు వామపక్షాలు పోరాటంతోనే తమకు భూములు దక్కాయని దేవరపల్లి దళితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

దళితుల సమస్య ఢిల్లీ స్థాయికి..: 

దేవరపల్లి దళితుల సమస్య ఢిల్లీ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాం. అధికార పార్టీ దౌర్జన్యాలను ఆయనకు వివరించాం. వైఎస్సార్‌సీపీ ప్రత్యక్ష పోరుకు దిగడంతో చంద్రబాబు సర్కారుకు బుద్ధి వచ్చింది. వామపక్షాలు దళితుల పక్షాన నిలిచి పోరాటం చేశాయి. వెంటనే ప్రభుత్వం తవ్వకాలు చేపట్టిన కట్టలను పూర్తిగా చదును చేసి దళితుల భూములు వారికి అప్పగించాలి.

– వైవీ సుబ్బారెడి, ఒంగోలు ఎంపీ

 

ప్రభుత్వానికి చెంపపెట్టు: 

వైఎస్సా ర్‌సీపీకి ఓట్లేశారన్న అక్కసుతోనే దేవరపల్లి దళితుల భూములను స్థానిక అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా ఆక్రమించారు. చెరువు పేరుతో దళితులను నిరాశ్రయులను చేసి భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. అధికారులకు ఇందుకు వత్తాసు పలికారు. చంద్రబాబు సర్కారుకు పోగాలం దాపురించింది. వైఎస్సార్‌సీపీ ప్రత్యక్ష పోరుతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దళితులకు భూములు పూర్తిగా స్వాధీనం చేసే వరకు అండగా నిలబడతాం.

– బాలినేని శ్రీనివాసరెడ్డి,వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు

 

మోసగిస్తే.. మరో ఉద్యమం

దేవరపల్లిలో దళితులు సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం ప్రారంభించిన నాటి నుంచే ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో రాజకీయ పార్టీలు, దళితులు, ప్రజలు భాగస్వాములై ప్రభుత్వ చర్యలను అడుగడుగునా అడ్డుకున్నారు. ప్రభుత్వ నిరంకుశ విధానానికి తమ పోరాటంతో సమాధానం చెప్పాం. రెండు నెలలపాటు దేవరపల్లి దళితులను మానసికంగా, భౌతికంగా, ఆర్థికంగా ప్రభుత్వం దెబ్బతీసింది. ప్రభుత్వ అరాచక పాలనకు దేవరపల్లి ఘటన నిదర్శనం.  ఇచ్చిన హామీని అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. మోసపూరిత చర్యలకు దిగితే మరో ఉద్యమం తప్పదు.

– పూనాటి ఆంజనేయులు.సీపీఎం జిల్లా కార్యదర్శి

 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

పర్చూరు మండలం దేవరపల్లి గ్రామంలో  22 ఎకరాల భూమి దశాబ్దాలుగా దళితుల స్వాధీనంలో ఉంది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తాగునీటి అవసరాల కోసం చెరువు తవ్వకమంటూ ఆ భూములను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు డీఆర్‌ఓ మొదలుకొని స్థానిక రెవెన్యూ అధికారులు సహకారం అందించారు. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లేశారన్న అక్కసుతోనే ఎమ్మెల్యే అనుచరులు దళితుల భూములను లాక్కునేందుకు ప్రయత్నించారు. అధికార పార్టీ నేతల ఆగడాలు దేవరపల్లి దళితులు ప్రతిఘటించారు. పోలీసులను అడ్డుపెట్టి అక్రమ నిర్భంధాలు కొనసాగించినా వారు వెనక్కి తగ్గలేదు. తొలుత వామపక్షాలు దళితులకు అండగా నిలిచి దళితుల భూములు వారికే ఉంచాలంటూ ఆందోళన చేపట్టాయి.

 

దళితులకు అండగా వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు..

ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ దళితులకు అండగా నిలిచింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డిల నేతృత్వంలో  
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top