అన్నదాత గొంతు నొక్కి.....

అన్నదాత గొంతు నొక్కి..... - Sakshi


∙ సీఎం సభావేదిక వద్ద రైతులను తరిమేసిన పోలీసులు

∙ ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరీక్షించి భంగపాటు

∙ ఆందోళన జరగకుండా ముందస్తు అరెస్టులు

∙ అడుగడుగునా పోలీస్‌  నిఘాలో సీఎం పర్యటన




శ్రీకాళహస్తి: అన్నదాత గొంతు నొక్కారు. తమ గోడు కనీసం సీఎంకైనా చెప్పుకుందామని వారు చేసిన ప్రయత్నాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటంటూ రైతుల నుంచి బలవంతంగా అధికారులు భూములను సేకరించారు. ఈవిషయంలో వారి బాధలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఈనేపథ్యంలో  సీఎం చంద్రబాబు గురువారం తొట్టంబేడు మండలం తాటిపర్తికి పరిశ్రమల భూమిపూజకు వచ్చారు. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకున్న రైతులు ఆయనకు తమ కష్టాలను వివరించాలని ఆరా టపడ్డారు. ఉదయం 10గంటలకే వారంతా సభాస్థలికి చేరుకున్నారు. సాయంత్రం వరకు నాలుగు గ్రామాలకు చెందిన వందలాదిమంది రైతులు మండుతున్న ఎండలో నిరీక్షించారు. తాగడానికి నీళ్లు,ఆహారం లేకపోయినా కూర్చున్నారు. తీ రా సీఎం కాసేపట్లో వస్తున్నారని తెలు సుకుని పోలీసులు వారిని దారుణంగా అడ్డుకున్నారు.



సమీప ప్రాంతాల్లో లేకుండా లేకుండా వెళ్లగొట్టారు. లేదంటే కేసులు తప్పవని హెచ్చరించారు. చేసేది లేక కొందరు భయంతో వెళ్లిపోయారు. మ రి కొందరిని బలవంతంగా బస్సుల్లో ఎక్కించి గ్రామాలకు తరలించారు.  1996లో 20మంది రైతులకు 40ఎకరాల భూమిని, 2008–09లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో 180 ఎకరాలను ఇందిరమ్మ పేరుతో ఎస్సీ, ఎస్టీలతోపాటు కొందరు బీసీలకు పంపిణీ చేశారు. వీరి భూములను అధికారులు లాక్కోవడంతో పరిహారం కోసం రైతులు సీఎం సభ వద్ద నిరసన తెలియజేశారు. కొందరు కన్నీరు పెట్టారు. ఇంకొందరు ఆగ్రహంతో రగిలిపోయారు. వచ్చే ఎన్నికల్లో పేదోళ్లే సరైన బుద్ధి చెబుతారం టూ హెచ్చరించారు.



స్థానికంగా ఉన్న పదిమంది రైతులకు సీఎంతో మాట్లాడే అవకాశం కల్పిస్తామని అ«ధికారులు చెప్పారు. తీరా సీఎం వచ్చాక అధికారులు వారిని పట్టించుకోలేదు. దీంతో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు ముం దస్తు అరెస్టులు చేశారు. రైతులపక్షాన నిలుస్తున్న తొట్టంబేడు మండల వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్‌ వాసుదేవనాయుడుతోపాటు సీపీఐ నేత గురవయ్య, సీపీఎం నేత అంగేరి పుల్లయ్యను అరెస్టు చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top