కార్యదర్శి స్వాహాకారం

కార్యదర్శి స్వాహాకారం


సభ్యులకు ఇవ్వాల్సిన ప్లాట్లు సొంతవారికి ధారాదత్తం..

మరికొన్ని ఇతరులకు  అక్రమంగా విక్రయం

రు.5 కోట్ల విలువ చేసే ప్లాట్లు అన్యాక్రాంతం

ఆ ప్లాట్లలోనే అపార్ట్‌మెంట్లు  నిర్మించి అమ్మకం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల  సొసైటీలో స్వాహాకాండ

అరెస్టరుునా ఆగని దందా.. అధికార పార్టీ నేతల అండ

విచారణ పేరుతో సాగదీస్తున్న అధికారులు


కబ్జాకు కాదేదీ అనర్హం అంటున్నారు కొందరు ప్రబుద్ధులు.. అనడమేంటి.. ఆచరణలోనూ చూపిస్తున్నారు.  కంచే చేను మేసిన చందంగా.. సొసైటీ పాలక పెద్దలే ప్లాట్లను అన్యాక్రాంతం చేసి.. ఎడాపెడా స్వార్జనకు పాల్పడుతున్నారు.  సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా సొంత కుటుంబ సభ్యులకు గిఫ్ట్.. అన్న ముద్దు పేరుతో రెండేసి ప్లాట్లు ధారాదత్తం చేసేశారు. ఆనక వాటిలో అపార్ట్‌మెంట్లు నిర్మించి ఎంచక్కా అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తరహా అక్రమాలకు నగర శివారులోని పీఎంపాలెం పరిధిలో ఉన్న కేంద్రప్రభుత్వ ఉద్యోగుల సహకార గృహనిర్మాణ సొసైటీ నిలయంగా మారింది. కోట్ల విలువైన ఈ స్వాహాకాండ గురించి వింటే ఎవరైనా ఔరా.. అనక మానరు.


విశాఖపట్నం: ఫొటోలో ఈ అపార్టుమెంట్ చూశారుగా.. నగరంలో సొసైటీల స్థలాలు కూడా కబ్జాకు గురవుతున్నాయని చెప్పడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. సెంట్రల్ ఎకై ్సజ్ అండ్ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లారుుస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సోసైటీ(నెం.1561) 1971లో సహకార సంఘంగా రిజిస్టర్ ్రఅరుు్యంది. మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) 5వ వార్డు పరిధిలోకి వచ్చే పీఎంపాలెంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలోని సర్వే నెం.359, 360లలో చెరో 10 ఎకరాలు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికి చాణక్యపురి లే అవుట్‌గా అభివృద్ధి చేసి సొసైటీ సభ్యులకు ఒక్కొక్కరికి 267 గజాలు చొప్పున సర్వే నెం.359లో 107, సర్వే నెం.360లో 102 ప్లాట్లు కేటారుుంచారు. అదే విధంగా నగరపాలెంలోని అయోధ్యనగర్‌లోని సర్వే నెం.63లో 15, సర్వే నెం.2లో 72 ప్లాట్లు కూడా ఇచ్చారు. అక్కడి వరకు అంతా సజావుగానే సాగినా.. ప్లాట్ల విభజన తర్వాతే అసలు కథ మొదలైంది.


ఇష్టారాజ్యంగా తనవారికి కేటారుుంపులు

సొసైటీ కార్యదర్శిగా వ్యవహరించిన డబ్బీరు గౌరీశంకరరావు అనే వ్యక్తి కోట్ల రూపాయల విలువైన సొసైటీ ప్లాట్లను సభ్యులకు తెలియకుండా తెగనమ్ము కున్నాడు. అక్కడితో ఆగకుండా సొసైటీ సభ్యులకే కేటారుుంచాల్సిన సర్వే నెం.359లో 94, 95.. సర్వే నెం. 360లో 24, 25, 26, 27 ప్లాట్లను నిబంధనలకు విరుద్ధంగా తన కుటుంబ సభ్యులకు గిఫ్టుల పేరుతో కట్టబెట్టేశాడు. మరో రెండు ప్లాట్లను మైనర్లకు అమ్మేశాడు. ఇలా సుమారు రు.ఐదు కోట్లు విలువ చేసే ప్లాట్లు అన్యాక్రాంతమయ్యారుు. ఈ ప్లాట్లలోనే ప్రస్తుతం బహుళ అంతస్తుల భవనాలు శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్నారుు. ఇక సర్వే నెం.2లోని 79 ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో సభ్యులకు కూడా తెలియని పరిస్థితి.రిటైరైన తర్వాత ఇల్లు కట్టుకుని శేష జీవితం హారుుగా గడుపుతామనుకున్న పలువురు సొసైటీ సభ్యులు తమ స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియక తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు.


పదవి నుంచి తొలగించినా..

సొసైటీ అస్తులకు కస్టోడియన్‌గా వ్యవహరించాల్సిన కార్యదర్శే తమ స్థలాలను అమ్ముకున్నాడని.. సొంతవారికి కట్టబెట్టేశాడని ఆలస్యంగా గుర్తించిన సొసైటీ సభ్యులు అవాక్కయ్యారు. తర్వాత తేరుకొని కార్యదర్శిని తొలగిస్తూ సొసైటీ సమావేశంలో తీర్మానం చేశారు. అరుుతే సొసైటీ తన చేతుల్లో ఉందని, తనను తొలగించే అధికారం సభ్యులకు లేదని గౌరీ శంకరరావు తేల్చిచెప్పడంతో అతనిపై న్యాయపోరాటానికి సభ్యులందరూ సిద్ధమయ్యారు. సెంట్రల్ ఎకై ్సజ్, అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లారుుస్ హౌస్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. ఉన్నతాధికారుల దృష్టికి వ్యవహారాన్ని తీసుకెళ్లడంతో విచారణకు ఆదేశించారు. బైలాకు వ్యతిరేకంగా స్థలాల కేటారుుంపులు జరిపినట్లు విచారణలో సహకార శాఖాధికారులు గుర్తించారు. ఈ కేటారుుంపులు అక్రమమేనని కో-ఆపరేటివ్ సోసైటీ ‘51 ఎంకై ్వరీ రిపోర్టు ప్రకారం’ నిర్థారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు గౌరీశంకరరావును అరెస్ట్ కూడా చేశారు.


అధికార పార్టీ నేతల అండ

మరోవైపు జైలుకు వెళ్లిన వ్యక్తి కార్యదర్శిగా కొనసాగటం చెల్లదంటూ సహకార శాఖ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఆదేశాలిచ్చారు. అరుునా పట్టించుకోని గౌరీశంకరరావు  అధికార పార్టీ నేతల అండదండలతో ఈ వ్యవహారాన్ని కోర్టు వరకు తీసుకెళ్లి సాగదీస్తున్నాడని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. చివరికి కోర్టు తప్పుబట్టినా..సహకార శాఖాధికారులు కాదు పొమ్మన్నా సరే పట్టించుకోకుండా సొసైటీకి చెందిన ప్లాట్లలో అక్రమ నిర్మాణాలు సాగిస్తూ అమ్మేసుకుంటున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


విచారణకు ఆదేశించాం

దీనిపై సహకార శాఖ జారుుంట్ రిజి్ట్రార్ గౌరీశంకర్‌ను వివరణ కోరగా. ఇటీవలే కొంతమంది సొసైటీ సభ్యులు తమకు మరోసారి ఫిర్యాదు చేశారని, ఈ వ్యవహారంపై విచారణ జరపమని జిల్లా రిజి్ట్రార్‌ను ఆదేశించామన్నారు. జిల్లా రిజి్ట్రార్ సన్యాసినాయుడ్ని వివరణ కోరగా, ప్లాట్ల అన్యాక్రాంతం..అక్రమ నిర్మాణం వ్యవహారం కోర్టులో ఉందన్నారు. కాగా కొత్త కార్యవర్గం కోసం ఎన్నికలు నిర్వహించాలని కార్యదర్శి వ్యతిరేక వర్గీయులు తమను కోరారని.. త్వరలోనే ఇరువర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.



నిబంధనలకు విరుద్ధంగా గిఫ్టులు

డబ్బీరు గౌరిశంకరరావు అనే వ్యక్తి ఈ సొసైటీకి కార్యదర్శిగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా తన తమ్ముడి కుమారునికి, తన కూతురికి రెండేసి ప్లాట్లు గిప్ట్‌గా ఇచ్చారు. ఇలా ఇవ్వడం చెల్లదని సహకార శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. పైగా మరో రెండు ప్లాట్లు మైనర్లకు గిప్ట్ ఇచ్చారు.. అదీ చెల్లదు. వీటన్నిటిలో అపార్టుమెంట్లు నిర్మించి అమ్ముకుంటున్నారు. అధికారులు స్పందించి వెంటనే పాత కార్యవర్గాన్ని రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి. - డి.సత్యనారాయణ, రిటైర్డ్ ఏడీఈ, విద్యుత్ శాఖ సొసైటీ సభ్యుడు 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top