చెంబు.. ముంత ఛీ.. ఛీ..!

చెంబు.. ముంత ఛీ.. ఛీ..! - Sakshi


సంపూర్ణ మరుగుదొడ్ల జిల్లా కోసం   కలెక్టర్‌ ప్రత్యేక ప్రణాళిక

ఇప్పటికే 36/820 మరుగుదొడ్ల  నిర్మాణాలతో రికార్డు

గణతంత్ర దినోత్సవం రోజు స్వచ్ఛ జగిత్యాల’ ప్రకటన

ముందుకొస్తున్న లబ్ధిదారులు




జగిత్యాల : చెంబు.. ముంత.. ఛీ.. ఛీ..! ఇది వింటేనే ఏదో వింతగా ఉందని కదూ..! రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా.. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ శ్రీకారం చుట్టిన  ప్రత్యేక కార్యక్రమమిది. ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకునేలా.. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం ద్వారా సంపూర్ణ మరుగుదొడ్లు కలిగిన జిల్లాగా జగిత్యాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారాయన. ఇప్పటికే గత నెల 27 ఉదయం 8:20గంటల నుంచి 28వ తేదీ రాత్రి 8:20 (36గంటలు) లోపు జిల్లా పరిధిలోని ఓబుళాపూర్‌ (మల్లాపూర్‌)లో 200, నడికుడ (మల్లాపూర్‌)లో 130, భూపతిపూర్‌ (రాయికల్‌)లో 200, అంతర్గాం (జగిత్యాల)లో 100, వెంగళాయిపేట (పెగడపల్లి)లో 190 చొప్పున మొత్తం 820 మరుగుదొడ్లు నిర్మించి దేశంలోనే రికార్డు సాధించారు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో జిల్లావ్యాప్తంగా.. అన్ని ఇళ్లలో మరుగుదొడ్డు నిర్మించుకునేలా ప్రజలను చైతన్యపరుస్తున్నారు. అన్ని మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. క్షేత్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షలు.. సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో ‘ ఇంకా చెంబు.. ముంతతోనా.. ఛీ.. ఛీ.. సిగ్గు.. సిగ్గు..’ అనే వినూత్న పోస్టర్‌ను విడుదల చే శారు. వీటిని అన్ని గ్రామాల్లో అంటించారు.



దీంతో ఇప్పటి వరకు మరుగుదొడ్లు నిర్మించుకోని లబ్ధిదారులు ఈ పోస్టర్లు చదివి ప్రేరేపితులవుతున్నారు. ఈ పోస్టర్‌లో బహిర్భూమికి ఆరుబయటకు వెళ్తే తలెత్తే బాధలు.. వచ్చే సమస్యలను స్పష్టంగా పేర్కొన్నారు. విషపురుగులతో ప్రమాదం.. వృద్ధులు, వికలాంగులకు, గర్భిణులకు వచ్చే కష్టం, పరిసరాల దుర్గంధం, తినే ఆహారం, నీరు కలుషితం, వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులు అన్నింటి కంటే ముఖ్యంగా మహిళల పరువు ప్రతిష్టలకు భంగం కలగడం వంటి ఈ పోస్టర్‌ను విడుదలచేశారు. వీటì  విముక్తి కోసం.. మరుగుదొడ్డి నిర్మించుకుందాం అనే నినాదంతో ఆవిష్కరించిన పోస్టర్‌తో ప్రజలు స్వచ్ఛదంగా ముందుకొస్తున్నారు.



ఇదీ కార్యక్రమం..

జిల్లాలో 2,53,619 ఇళ్లు ఉన్నాయి. జిల్లా అవతరించేనాటికి 59,179 ఇళ్లకు మరుగుదొడ్లు లేవు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వకరు 28వేల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. 22వేల నిర్మాణాలు ముగింపు దశలో ఉన్నాయి. 10 వేల మరుగుదొడ్ల నిర్మాణాలు పునాదుల దశలో ఉన్నాయి. వచ్చే 19 రోజుల్లోగా 32 వేల ని ర్మాణాలు పూర్తి చేయాలని అధికార యంత్రాంగం పూ నుకుంది. ఈనెల 26.. రిపబ్లిక్‌డే వేడుకల్లో .. సంపూర్ణ మరుగుదొడ్లు కలిగిన జిల్లా ప్రకటించాలని అధికారు లు, ప్రజాప్రతినిధులు  నిర్ణయం తీసుకున్నారు. గడువులోగా నిర్మాణాలన్నీ పూర్తి చేసే దిశగా.. కలెక్టర్‌ పం చాయతీ వార్డుల మొదలు.. పట్టణాల వరకు అధికారులకు పర్యవేక్షణ బాద్యతలు అప్పగించారు. జిల్లా అధికారులను మండలాలకు ఇన్‌ఛార్జీలుగా నియమించిన కలెక్టర్‌.. మండల స్థాయి అధికారులను గ్రామ పంచాయతీలకు, గ్రామ స్థాయి అధికారులను వార్డులు, ఆవాసా ప్రాంతాలకు ఇన్‌ఛార్జీలుగా నియమించారు. అలాగే.. జిల్లా నుంచి గ్రామీణ స్ధాయి వరకు ఉన్న స్వచ్చంద సంస్థలు... స్వయం సహాయక సంఘాలు, ప్రేరక్‌ల సేవలూ వినియోగించుకుంటున్నారు.



పెరిగిన పోటీ..

స్వచ్ఛ గ్రామం.. స్వచ్ఛ మండలం.. స్వచ్ఛ జగిత్యాల లక్ష్యంతో జిల్లాలో ఉద్యమంలా జరుగుతోన్న మరుగుదొడ్ల నిర్మాణాల విషయంలో జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధుల మధ్యా పోటీతత్వం పెరిగింది. అధికారుల సమీక్షలు, సమావేశాలతో పాటూ స్థానిక ప్రజాప్రతినిధులూ తమ ప్రాంతాల్లో సాధ్యమైన ంత త్వరగా నూరుశాతం మరుగుదొడ్డ నిర్మాణాలు పూర్తి చేసేలా ^è ర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ తన నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విస్తృతంగా పర్యటించి సమీక్ష, సమావేశా లు సైతం నిర్వహించారు. ఈ నెల రెండో తేదిన.. వెల్గటూరులో సమీక్ష నిర్వహించిన ఆయన మరో ఎనిమిది రోజుల్లో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించి.. సం పూర్ణ పారిశుద్ద్య మండలంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆదేశించారు. జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ఇదే పోటీతో తమ తమ ప్రాంతాల్లో పని చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top