మా ప్రాంతాన్నే.. కొత్త మండలం చేయాలి

మా ప్రాంతాన్నే.. కొత్త మండలం చేయాలి - Sakshi


►  జిల్లా పునర్విభజన నేపథ్యంలో డిమాండ్

పలుచోట్ల కొనసాగుతున్న ఆందోళనలు, నిరాహార దీక్షలు

అధికారులకు వినతిపత్రాల సమర్పణ

కలెక్టర్ కాన్వాయ్‌ని అడ్డుకున్న రాజోలివాసులు

మండల  కేంద్రాలుగా ఏ గ్రామాలు ఆవిర్భవించేనో..

కొత్త మండలాల ఏర్పాటుపై పెరుగుతున్న రాజకీయ ఒత్తిడి


 

కలెక్టర్ కాన్వాయి అడ్డగింత...

వడ్డేపల్లి మండలంలోని పడమటి గార్లపాడులో గ్రామజ్యోతిలో పాల్గొని తిరిగి వెళ్తున్న కలెక్టర్ శ్రీదేవిని రాజోలి గ్రామస్తులు అడ్డుకున్నారు. 10రోజులుగా రాజోలిని మండలం చేయాలని రిలే దీక్షలు చేపడుతున్నా ఎవరూ స్పందించడం లేదని ఆగ్రహించిన గ్రామస్తులు కలె క్టర్ కాన్వాయ్‌కి అడ్డుగా నిల్చున్నారు. రాజోలిని మండల కేంద్రం చేస్తామని ప్రకటించేవరకు పోనివ్వబోమని భీష్మించుకుని కూర్చున్నారు. పరిస్థితి గమనించిన పోలీసులు వారిని పక్కకు తప్పుకోవాలని సూచించారు. పదినిమిషాల అనంతరం పోలీసులు గ్రామస్తులను పక్కకుతోసి కలెక్టర్ కాన్వాయ్‌ను పంపించారు.

 

 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్త మండలాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో తమ గ్రామాలను మండలాలుగా చేయాలన్న డిమాండ్ పెద్దఎత్తున వస్తోంది. సకల సౌకర్యాలు కలిగిన తమ ప్రాంతాన్ని మండల కేంద్రంగా చేయాలని జిల్లాలోని కొన్ని ప్రాంతాల ప్రజలు ఏకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. శనివారం ఏకంగా రాజోళి వాసులు కలెక్టర్ కాన్వాయ్‌నే అడ్డుకున్నారు. భౌగోళికంగా రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లో ఇప్పటికే 64 మండలాలున్నాయి.



ఈ మండలాల తో కూడిన ప్రాంతాలను మూడు జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వ చ్చింది.  పాలన సౌలభ్యం కోసం గ్రామీ ణ ప్రాంతాల్లో మండల వ్యవస్థను పటిష్టం చేయడంతోపాటు కొత్త మండలాలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భా విస్తోంది. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జి ల్లాలో 5 అర్బన్ మండలాలను, 6 గ్రామీ ణ మండలాలను కొత్తగా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు జిల్లా అధికారులను ఆదేశిం చింది. దీనిపై అన్ని హంగులు ఉన్న గ్రా మీణ ప్రాంతాలను మండల కేంద్రంగా మార్చడానికి ఆయా ప్రాంతాలకు ఉన్న అర్హతలపై జిల్లా అధికారులు కసరత్తు చే శారు. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 6 మండలాలు మాత్రమే ఏర్పాటుచేయడానికి అవకాశముండగా దాదా పు ప్రతి మండలం నుంచి ఒకటి రెండు గ్రామా లు తమ ప్రాంతాన్ని మండల కేంద్రాలు గా చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.

 

ఆందోళనబాట..

మండలాలుగా చేయాలని ఇప్పటికే ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేయడమే కాక వివిధ రూపాల్లో ఆందోళన చేశారు. రాజోళిలో అయితే దీక్షలు చేపట్టారు. మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు వినతిపత్రాలు అందజేశారు. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రంగా చేయాలని డిమాండ్ రావడంతో రాజకీయ పార్టీల నేతలకు ఆ గ్రామాల ప్రజల కోరిక నెరవేర్చడం శక్తికి మించిన భారంగా మారింది. మూడు దశాబ్దాల తర్వాత కొత్త మండలాలను ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం సంకల్పించడంతో ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా ఆయా గ్రామాల ప్రజలు రాజకీయంగా పార్టీల నేతలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల డిమాండ్‌పై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో.. ఏ గ్రామాలను మండల కేంద్రాలుగా ఏ ప్రాతిపదికన ప్రకటిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

మండలాల డిమాండ్ ఇలా..

అచ్చంపేట మండలంలోని సిద్ధాపూర్, అమ్రాబాద్ మండలంలోని పదర, మన్ననూర్‌లను మండలాలు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మన్ననూర్‌ను మండలం చేయాలని చెంచులు కోరుతున్నారు. వంగూర్ మండలంలోని చారకొండ, మానవపాడు మండలంలోని ఉండవెల్లి, అలంపూర్, ఇటిక్యాల మండలంలోని ఎర్రవెల్లి చౌరస్తా, వడ్డేపల్లి మండలంలోని రాజోళి, మాన్‌దొడ్డి,  కొల్లాపూర్ మండలంలోని సింగోటం, పెంట్లవెల్లి, గట్టు మండల పరిధిలోని నందిన్నె, కుట్టినెర్ల, ఆలూరు, సింగనదొడ్డి గ్రామాల పేర్లు సూచిస్తున్నారు.



కోస్గి మండలంలోని గుండూమాల్, బాలానగర్ మండలంలోని రాజాపూర్, ఉదిత్యాల, నవాబుపేట మండలంలోని కొల్లూర్, ఆమన్‌గల్ మండలంలో కడ్తాల్, ధరూర్ మండలంలోని ఉప్పేర్, పాతపాలెం, అల్వాల్‌పాడు, కొత్తకోట మండల పరిధిలో మదనాపురం, పామాపురం, అజ్జకొలు, బిజినేపల్లి మండలంలో పాలెం గ్రామాలను మండలాలుగా చేయాలని ఆ ప్రాంతాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

ఇప్పటికే ప్రభుత్వానికి చేరిన కొత్తమండలాల పేర్లు .

జిల్లా అధికారులకు మాత్రం కొత్త మండల కేంద్రాలుగా కొన్ని గ్రామాల పేర్లను ఇప్పటికే సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆత్మకూరు మండలంలోని అమరచింత, బాలానగర్ మండలంలోని రాజాపూర్, వీపనగండ్ల మండలంలోని చిన్నం బావి, గట్టు మండలంలోని నందిన్నె, ధన్వా డ మండలంలోని మల్దకల్ గ్రామాలు మం డల కేంద్రాలుగా రూపొందడానికి అర్హతలు కలిగి ఉన్నాయని ప్రభుత్వానికి  ఇప్పటికే నివేదిక సమర్పించారు. అయితే కొత్త మండలాల ఏర్పాటుపై ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ప్రభుత్వ ప్రతిపాదనల్లో మరికొన్ని చోటుచేసుకొనే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. .

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top