అభివృద్ధి మంత్రం.. కనికట్టు తంత్రం!

అభివృద్ధి మంత్రం.. కనికట్టు తంత్రం! - Sakshi


తిరుపతి వేదికగా నేటి నుంచి టీడీపీ మహానాడు

సాక్షి, హైదరాబాద్ :  తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల సభ ‘మహానాడు’ను శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు తిరుపతిలోని పురపాలక మైదానంలో నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి.. దుబాయ్, అమెరికా, యూకే తదితర దేశాల నుంచి సుమారు 30 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర విభజన వంటి ఎన్నో అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతున్నామని, తమ పాలన అద్భుతంగా ఉందని గొప్పలు చెప్పుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.



చంద్రబాబు.. 20 మార్లు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారని, తాము రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగడుగునా అడ్డం పడుతున్నారని నొక్కి చెప్పనున్నట్లు సమాచారం. వివిధ అంశాలపై మొత్తం 28 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.

 

ఫిరాయింపులకు అభివృద్ధి ముసుగు

2014 జూన్‌లో చంద్రబాబు అధికారం చేపట్టింది మొదలు ఇప్పటి వరకు జరిగిన 1.35 కోట్ల రూపాయల కుంభకోణాలను అభివృద్ధిగా చెప్పుకునేందుకు మహానాడు వేదికను ఉపయోగించుకోనున్నారు. తెలంగాణలో ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని వాపోయిన చంద్రబాబు.. ఇపుడు ఏపీలో ఆయన అదే పనిచేస్తూ దానికి అభివృద్ధి ముసుగు తగిలించి తన ఘనతగా చెప్పుకుంటున్నారు.



ఇదంతా తాను సాధించిన అభివృద్ధి అని గొప్పలు చెప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందని చెబుతూ.. తెలంగాణాలో మాత్రం తాము ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నామని చెబుతూనే ఓటుకు కోట్లు కేసు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాత్రం ఆచితూచి మాట్లాడనున్నట్లు సమాచారం.

 

లోకేశ్‌ను కీర్తిస్తూ స్క్రిప్ట్ రెడీ!...: మహానాడు వేదికగా పార్టీ అధినేత చంద్రబాబు, కుమారుడు లోకేశ్‌లను పొగడ్తలతో ముంచెత్తేందుకు పలువురు నేతలు సిద్ధమయ్యారు. లోకేశ్‌కు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించాలని కొందరు నేతలు గట్టిగా మాట్లాడేలా పార్టీ ముఖ్య నేతలు త ర్ఫీదునిచ్చినట్లు సమాచారం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top