పండుగలా అవతరణ వేడుకలు

పండుగలా అవతరణ వేడుకలు


► వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ.సింగ్‌

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణ అవతరణ వేడుకలను పం డుగలా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ.సింగ్‌ జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లాస్థాయిలో వేడుకలు నిర్వహించా లని సూచించారు. జిల్లాస్థాయిలో వివిధరంగాలలో విశేష కృషి  చేసిన 11 మందిని ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేయాలని పేర్కొన్నారు.



సాంస్కృతిక కార్యక్రమాలను జిల్లా, డివిజన్‌స్థాయిలో ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రధాన కూడళ్లను విద్యుత్‌ దీపాలతో అలంకరించి పండుగ వాతావరణం కల్పించాలని తెలిపారు. జూన్‌ 3వ తేదీన కేసీఆర్‌ కిట్టు పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వాస్పత్రులలో, ఏరియా ఆస్పత్రులలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ పాల్గొనాలన్నారు. జూన్‌ 4న ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వమించాలని పేర్కొన్నారు. పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తుల  పరిశీలన వేగవంతంచేసి రెండు రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కార్పొరేషన్, మున్సిపాలిటీలలో ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతానికి సంబంధించి నియోజకవర్గ కేంద్రంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ పాల్గొనేలా ఏర్పాట్లు ఉండాలని అన్నారు.



2018, డిసెంబర్‌ నాటికి రాష్ట్రాన్ని బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందు కు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో స్వచ్ఛ గృహిశ్, స్వచ్ఛ రుతలను నియమించుకోవాలని సూచించారు. ఉపాధిహమీ పథ కం క్రింద శానిటేషన్‌ వర్కర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్లు సర్ఫరాజ్‌ అహ్మద్, కృష్ణభాస్కర్, డీఆర్వో అయేషామస్రత్‌ఖానమ్, డీఎంహెచ్‌వో శ్రీధర్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top