ప్రపంచ దేశాల్లో తెలంగాణ నంబర్‌వన్‌

ప్రపంచ దేశాల్లో తెలంగాణ నంబర్‌వన్‌ - Sakshi

  •  రహదారుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు

  • రాష్ట్రంలో 2,600 కిలోమీటర్లు జాతీయరహదారులు

  •  రాజకీయాల కోసం కాంగ్రెస్‌ అరోపణలు

  • నిజాంసాగర్‌ : రాష్ట్ర రహదారులను సుందరంగా తీర్చిదిద్ది రెండేళ్లల్లో ప్రపంచదేశాల్లోనే తెలంగాణ న ంబర్‌వన్‌ స్టేట్‌గా నిలుస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావ్‌ అన్నారు. ఆరవై ఏళ్లపాటు సింగిల్‌ రోడ్లుగా  2,600 కిలోమీటర్లను తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ర హదారుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. మంజీరనదిపై రూ. 25 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు శనివారం ఉదయం నిజామాబాద్‌ జిల్లా నిజాంసాగర్‌ మండల కేంద్రంలో శిలాఫలకాన్ని మంత్రి అవిష్కరించారు. రైతులు పండించిన పంటల విక్రయాలకు రహదారులు ఎంతో అవసరమని, సీమాంధ్ర పాలనలో ప్రాధాన్యతను ఇవ్వకపోవడంతో రోడ్డు రవాణా వ్యవస్త భ్రష్టు పట్టిందన్నారు. రోడ్లపై కేజ్‌వీల్స్‌ తిర గకుండా ప్రజాప్రతినిధులు, ఆర్‌ఆండ్‌బీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు.  పొరుగు రాష్ట్రాల్లో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీళ్లులేక ఏడారిగా మారిందన్నారు.  గోదావరి నదిపై కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్ర శేఖర్‌రావ్‌ ప్రాజెక్టుల రీడిజైనింగ్, రీఇంజనీరింగ్‌ సర్వే చేయించారన్నారు. కాం్రVð స్‌ నాయకులు రాజకీయాల కోసం ఇష్టారీతిన మాట్లాడటం సరికాదన్నారు. ప్రాణహిత, చేవేళ్ల, తుమ్మిడి హట్టి పథకాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోలేదన్నారు. ఎంతకష్టమోచ్చినా, నష్టమోచ్చినా, తలతా కట్టు పెటైనా సరే తెలంగాణ రాష్ట్రానికి గోదావరి జలాలను తెచ్చి తీరుతా మన్నారు. అర్థంపర్థం లేకుండా ఆరోపణలు చే స్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులను రైతులు భూస్థాపితం చేస్తారన్నారు. మేడిగడ్డ బ్యారేజీపై ఆరోపిస్తున్న ఉత్తమ్, జానారెడ్డిలు దమ్ముంటే రుజువు చేయాలని సవాల్‌ విసిరారు.కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్,జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే తదితరులు పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top