170 మంది లోపలే ఉన్నారు... బయట..

170 మంది లోపలే ఉన్నారు... బయట..

  • రెండున్నర గంటలపాటు నిలిచిపోయిన విమానం

  • ప్రయాణికులు లోపలుండగానే మరమ్మతులు

  • గోపాలపట్నం: విశాఖ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. సరిగ్గా విమానంలోకి ప్రయాణికులు ఎక్కాక సమస్య ఎదురవ్వడంతో అప్పటికపుడు ప్రయాణికులను దించడానికి వీల్లేక యుద్ధప్రాతిపదికపై సాంకేతిక నిపుణులు లోపాన్ని సరిచేసి విమానాన్ని కదిలించారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాదు నుంచి విశాఖకు స్పైస్‌జెట్ విమానం సాయంత్రం 6.30కి చేరింది. ఇది ఏడు గంటలకు తిరిగి హైదరాబాదు బయలుదేరాల్సి ఉండగా, దాదాపు 170మంది ప్రయాణికులు విమానంలో కూర్చున్నారు. ఇంతలో విమానానికి సాంకేతిక సమస్య ఎదురవ్వడంతో పెలైట్ అప్రమత్తమయ్యారు. తలుపులు తెరవడానికి కూడా ఆస్కారం లేకపోవడంతో ప్రయాణికులను విమానంలోనే ఉంచి సాంకేతిక నిపుణులను రప్పించారు. ప్రయాణికులకు నూడిల్సు తదితర ఆహారం సరఫరా చేశారు. ఎట్టకేలకు రాత్రి 9.25కి సమస్య పరిష్కారమై విమానం కదిలింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వెళ్లారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top