దిగొచ్చిన టమాట ధర

మార్కెట్‌లో టమాట

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) : ఎట్టకేలకు టమాట ధర రూ.10 లకు దిగోచ్చింది.  మూడు నెలలుగా ఎండల కంటే మెండుగా మండిపోయిన టమాట ధరలు దిగి రావడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల కిందట కిలో రూ.50 నుంచి 80వరకు, బహిరంగ మార్కెట్లో  దారుణంగా రూ.100లు పలికింది. ఈ ధరలతో టమాట ప్రియులు ఆందోళన చెందారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారి రాష్ట్రంలో చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మదనపల్లి, గుర్రంకొండ, పలమనేరులో  టమాట పంట అధికంగా దిగుబడులు వచ్చాయి, దీంతో  టమాట కొనుగోలుదారులు సంచులు నింపుకోనేందుకు అవకాశం దక్కింది. మార్కెట్లో టమాట ఒక్కసారిగా ఇంత తక్కువ ధరకు దొరకడం అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా శ్రీకాకుళం జిల్లాలో డిసెంబరు, జనవరి నెలల్లో  తక్కువ ధరకు టమాటలు దొరికేవి. తరువాత అమాంతం ధరలు పెరిగి మళ్లీ ఇప్పుడు తగ్గుముఖం పట్టడంతో టమాట ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా టమాటలను మరింత తక్కువ ధరకు విక్రయించేందుకు రైతుబజారు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top