టమా‘ఠా’..


మంచిర్యాల అగ్రికల్చర్‌ : ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో రైతులు దీర్ఘకాలిక వరి, గోధుమ, శెనగ, పప్పు దినుసుల సాగు తగ్గించి సల్పకాలిక పంట అయిన కూరగాయల వైపు మొగ్గుచూపారు. కూరగాయల్లో ప్రధానంగా టమాటనే సాగు చేశారు. ఉమ్మడి జిల్లాలో గతేడాది 8 వేల హెక్టార్లలో సాగు కాగా.. ఈ ఏడాది 9.180 హెక్టర్లాకు చేరింది. గతేడాదితో పోలిస్తే ఈసారి వెయ్యికి పైగా హెక్టార్లలో అధికంగా సాగు అయ్యింది. టమాట సాగుకు ఒక ఎకరాకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీల ఖర్చుతో రూ.16 వేల నుంచి 22 వేల వరకు ఖర్చవుతుందని రైతులు అంటున్నారు.



గతేడాదితో పోలిస్తే ఎరువులు, పురుగుల మం దులు, విత్తనాల ఖర్చు పెరిగింది. అయినా.. సాగు చే స్తే దిగుబడి వచ్చే సమయానికి ధర ఢమాల్‌మంది. మంచిర్యాల జిల్లా పరిధిలో బెల్లంపల్లి, తాండూర్, నె న్నెల, జైపూర్, భీమిని, కన్నెపల్లి, చెన్నూర్, వేమనపల్లి, భీమారం, లక్సెట్టిపేట, హాజీపూర్, దండేపల్లి, జన్నారం మండలాల్లోని గ్రామాల్లో అధికంగా సాగు చేస్తున్నారు.



రోజూ మార్కెట్‌కు ఐదు టన్నుల టమాట..

రబీ పంటల్లో అధికంగా కూరగాయల సాగులో భాగం గా సాగువుతున్న పంట టమాట. ఆయా మండలాల నుంచి జిల్లా కేంద్రంలోని మంచిర్యాల రైతుబజారుతోపాటు ఇతర పట్టణ ప్రాంతాల్లోని మార్కెట్‌కు తీసుకొ చ్చి రైతులు విక్రయిస్తుంటారు. దీంతోపాటు మహారా ష్ట్ర, నిజంబాద్, గోదావరిఖని వంటి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లా కేంద్రానికి రోజుకు 4 నుంచి 5 ట న్నుల వరకు టమాటను రైతులు తీసుకొస్తుంటారు. ప ది పదిహేను రోజుల క్రితం టమాట, క్యారెట్‌ ధర (25 కిలోల పెట్టే) రూ.600 నుంచి 800 వరకు పలికింది. ప్రస్తుతం రూ.180 నుంచి 200 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో కొంత మంది రైతులు దిగుడులు అధికంగా వస్తుండటంతో పొలం వద్ద తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. మరొకొంత మంది జిల్లా కేంద్రానికి తీసుకొస్తున్నారు. టమాట ధర పెరుగుతుందని పొలంలో ఉంచుకుంటే మురిగిపోయి నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. పంట దిగుబడి వస్తుందని సం బరపడినా మద్దతు రావడం లేదు. కనీసం జిల్లా కేంద్రానికి తీసుకురావడానికి రావాణా ఖర్చులు కూడా రావడం లేదని తెలిపారు.



నిల్వ సౌకర్యం లేక..

టమాట సాగు జిల్లాలో ఏటా అధికంగానే ఉంటోంది. డిసెంబర్‌ నుంచి మార్చి వరకు మార్కెట్‌కు వస్తుంది. ఈ సమయంలో కిలో రూ.30 పైగా ఉన్న టమాట ధర రూ.5 నుంచి రూ.10 పడిపోతోంది. ఏళ్ల తరబడి ఈ రెండు మూడు నెలల్లో ధర పడుతూనే ఉంటుంది. అయితే.. ఈ సందర్భంగా కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటు చేయాలని అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వం ఉద్యానవన పంటలకు భారీగా నిధులు కేటాయించి రైతులను ప్రోత్సహించాలని చెబుతున్నా.. ఆచరణలో కానరావడంలేదు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే గిట్టుబాటు ధర రాక నష్టపోతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top