స్వైన్ ఫ్లూపై తప్పుడు లెక్కలు!

స్వైన్ ఫ్లూపై తప్పుడు లెక్కలు!


► వైద్యాధికారులపై కేంద్ర బృందం మండిపాటు



చిత్తూరు (అర్బన్ ) : గత రెండు నెలల కాలంలో జిల్లాలో నమోదైన స్వైన్ ఫ్లూ కేసులు ఏ ప్రాతిపదికన నిర్ధారించారని  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కేంద్ర వైద్య బృందం నిలదీసింది. జిల్లాలో నమోదైన స్వైన్ ఫ్లూ కేసులపై విచారణ చేపట్టడానికి మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఓ బృందం గురువారం చితూ్తరుకు వచ్చింది. ఢిల్లీకి చెందిన డాక్టర్‌ అబిత్‌ చటర్జీ, డాక్టర్‌ ప్రనబ్‌ భవన్ తో పాటు రాష్ట్ర వైద్య శాఖ అధికారులు డాక్టర్‌ శ్రీలక్ష్మి, డాక్టర్‌ భార్గవి తొలుత చితూ్తరులోని డీఎం అండ్‌ హెచ్‌వో కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ విజయగౌరితో భేటీ అయ్యారు.


బృంద సభ్యులు మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో 54 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు, ఇద్దరు మృతి చెందినట్లు ఏ ప్రాతిపదికన నివేదిక ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై డీఎం అండ్‌ హెచ్‌వో మాట్లాడుతూ స్వైన్ ఫ్లూ వ్యాధిని రాపిడ్‌ పరీక్ష ద్వారా నిర్ధారించామన్నారు. దీంతో పాటు తమిళనాడుకు చెందిన వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో ఇచ్చిన రిపోరు్టను కూడా జత చేశామన్నారు. రాపిడ్‌ పరీక్ష, సీఎంసీ ఆస్పత్రి ఇచ్చిన నివేదికతో వ్యాధి నిర్దారణ ఎలా చేశారని కేంద్ర బృంద సభ్యులు ప్రశ్నించడంతో అధికారులు నీళ్లు నమిలారు. వ్యాధి గ్రస్తులకు ఎలాంటి పరీక్షలు చేశారో తాము స్వయంగా చూస్తే తప్ప ఓ అభిప్రాయానికి రాలేమని బృంద సభ్యులు పేర్కొన్నారు.



చిత్తూరు ఆస్పత్రిలో వసతుల లేమిపై అసంతృప్తి

జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటప్రసాద్‌తో కలిసి చితూ్తరు ప్రభుత్వాస్పత్రిని బృందం సభ్యులు సందర్శించారు. ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో రోగులకు మాస్కులు అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించారు. చేతులు కడుక్కోవడానికి కనీసం సోపును కూడా ఉంచకపోవడం ఏమిటని వైద్యులను ప్రశ్నించారు. ఆస్పత్రిలోని పలు వారు్డలను, స్కానింగ్‌ యూనిట్లను బృందం తనిఖీ చేసింది. ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన స్న్ ఫ్లూ వారు్డలో రోగులకు కనీస సదుపాయాలు, వసతులు లేకపోవడంపై కేంద్ర బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. మరో రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించి నివేదికను కేంద్రానికి అందజేయనుంది. చితూ్తరు ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు పాల్‌ రవికుమార్, గౌరీప్రియ తదితరులు కేంద్ర బృందం వెంట ఉన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top