నియంతృత్వానికి కాలం చెల్లింది

నియంతృత్వానికి కాలం చెల్లింది - Sakshi


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రధాని నరేంద్రమోదీ నియంతృత్వ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సర్వే సత్యనారాయణ అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక అత్యయిక పరిస్థితిని తీసుకురావడం ద్వారా పేదలను రోడ్ల మీద నిలబెట్టారని దుయ్యబట్టారు. బ్యాంకుల్లో భద్రపరుచుకున్న డబ్బును ఇవ్వకుండా ఆంక్షలు విధించి ప్రజలను మానసిక క్షోభకు గురిచేశారని ఆరోపించారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, పార్టీ నేతలు బండారి లక్ష్మారెడ్డి, నందికంటి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వెనక్కి తెస్తానని ప్రచారం చేసిన ప్రధాన మంత్రి.. నయాపైసా వెనక్కి తీసుకురాకపోగా.. నోట్ల మార్పిడిలో సొంతపార్టీ నేతలకు డబ్బు సంచులను పంపారని అన్నారు. ఆర్‌బీఐ నుంచి నేరుగా బీజేపీ, భాగస్వామ్య పక్షాలకు పెద్ద ఎత్తున నగదు తరలిపోయిందని ఆరోపించారు.



 బ్లాక్‌ మనీని మార్చుకున్న దోషులను పట్టుకోకుండా పేదలను కష్టాలకు గురిచేయడం దారుణమన్నారు. నవంబర్‌ 8వ తేదీ తర్వాత జరిగిన పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎంత నల్లధనం వెనక్కి తేగలిగారు? ఆర్థికంగా దేశం ఎంత నష్టపోయింది? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? ఎంతమంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు? అనే ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలని నిలదీ శారు. నోట్ల రద్దును మొదట్లో వ్యతిరేకిం చిన కేసీఆర్‌.. 24 గంటల్లోనే మనసు మా ర్చుకోవడం వెనుక మతలబు దాగుం దన్నారు. దోచుకున్న డబ్బుకు గ్యారెంటీ లభించగానే మోదీని మెచ్చుకుంటూ ప్రకటనలు చేశారని సర్వే వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుపై ప్రధానిని అభినందిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం సిగ్గుచేట న్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. సహకార బ్యాంకుల నుం చి రుణాలు తీసుకునే రైతులకు రెండు నెలల పాటు వడ్డీ మాఫీ చేస్తానని ప్రధాని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నా రు. ఏడాది వరకు రూ.లక్ష లోపు రుణాలకు వడ్డీలేదని... కొత్తగా మాఫీ పేరిట మోసపూరిత ప్రకటనలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 7న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top