దళితులకు చేయూత

దళితులకు చేయూత - Sakshi


ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా కార్యాచరణ

భూపంపిణీతో పాటు పలు పథకాల వర్తింపు

కచ్చితంగా భూమి  సాగులోకి వచ్చేలా సాయం

వ్యవసాయ శాఖ ద్వారా మొదటి పంటకు

పెట్టుబడి, మెళకువలపై శిక్షణ కూడా..

ఇప్పటి వరకు 130 మందికి 359.07  ఎకరాలు పంపిణీ




వరంగల్‌ రూరల్‌: రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న భూపంపిణీ పథకం ద్వారా జిల్లాలోని అర్హులైన దళితులకు భూమి అందజేసేందుకు జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సూచన మేరకు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. నిరుపేద దళితులకు భూమి అందజేయడం ద్వారా బలహీనులైన వారిని దళితులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. భూమి ఇవ్వడమే కాకుండా సాగుకు యోగ్యంగా సిద్ధం చేయడానికి భూమి అభివృద్ధిలో భాగంగా ఉపాధి హామీ పథకం ద్వారా సారవంతమైన మట్టిని తీసుకొచ్చి చదును చేయించనున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఇప్పటి వరకు 359.07 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. జిల్లాలోని 15 మండలాల్లో కొనుగోలు చేసిన ఈ భూమిని 130 మంది భూమి లేని నిరుపేద దళిత మహిళలకు అందచేశారు.



మొదటి పంటకు పెట్టుబడి కూడా..

నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయడంతో పాటు పలు పథకాలు వర్తింప జేయనున్నారు. భూములను సాగుకు అనువుగా మార్చేలా ఉపాధి హామీ పథకం ద్వారా సారవంతమైన మట్టి తెప్పించి చదును చేయిస్తారు. అలాగే, మొదటి పంటకు పెట్టుబడితో పాటు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహరక మందులు, దున్నుడు కూళ్లు  వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సమకూర్చాలని ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు నిర్ణయించారు. ఇంకా సబ్‌ ప్లాన్‌ ద్వారా 13 బోర్లు వేయించగా.. మరో 40 బోర్లు, బావులు మంజూరు చేశారు.



జాతీయ ఉపాధి హమీ పథకంలో..

దళితులకు ఇచ్చిన భూమి కచ్చితంగా సాగులోకి రావాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు సాగు అవసరాల కోసం ప్రతీ 6–9 ఎకరాలకు ఒక వ్యవసాయ బావి తవ్వనున్నారు. అనంతరం భూములను నాగళ్లతో లోతుకు చాళ్లు వేయిస్తారు. రైతుల పంట పొలాల్లో నాడెపు కంపోస్టు ఫిట్, ఫాం పాండ్‌ తవ్విస్తారు. ఆ తర్వాత రైతుల పంట పొలాల్లో కూరగాయల సాగుకు అనుగుణంగా తీగ జాతి కూరగాయల సాగుకు పందిల్లు వేయిస్తారు. అవసరమైతే పశువుల కొట్టం కూడా ఏర్పాటు చేయిస్తారు.



వ్యవసాయ శాఖ ద్వారా శిక్షణ

జిల్లాలో భూమి అందజేసిన 130 మంది లబ్ధిదారులకు భూమి అభివృద్ధి, మెరుగైన పంటల సాగుపై వరంగల్‌ రూరల్‌ జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్‌ ఆధ్వర్యాన ఒక రోజు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్టు వరంగల్‌ రూరల్‌ జిల్లా ఎస్సీ కార్పోరేషన్‌ అధికారి డి.సురేష్‌ తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారితో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాగులో తీసుకోవాల్సిన మెళకువలపై అవగాహన కల్పిస్తామన్నారు. పంటలు, కూరగాయలే కాకుండా పశుపోషణపై శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు.



భూమి కొనుగోలు ఇలా..

వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని ఆత్మకూరు మండలం పులుకుర్తిలో 20.17 ఎకరాలు, చెన్నారావుపేట మండలం కోనాపూర్‌లో 24 ఎకరాలు, లింగగిరిలో 22.04 ఎకరాలు, దుగ్గొండి మండలంలోని ముద్దునూరులో 25.12 ఎకరాలు, తిమ్మంపేటలో 10.39 ఎకరాలు, వెంకటాపూర్‌లో 8.12 ఎకరాలు, నల్లబెల్లి మండలంలోని గోవిందపూర్‌లో 11 ఎకరాలు, రాంపూర్‌లో 30 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. నెక్కొండ మండలంలోని నాగారం 43.28 ఎకరాలు, దీక్షకుంటలో 21 ఎకరాలు, పరకాల మండలం వరికోలులో 7.32 ఎకరాలు, నాగారంలో 12.27 ఎకరాలు, చౌటుపర్తిలో 12.32 ఎకరాలు , పర్వతగిరి మండలంలోని వడ్లకొండలో 44.11 ఎకరాలు, శాయంపేట మండలం కాట్రాపల్లి లో 64.39 ఎకరాలు భూములు కొనుగోలు చేసి 130 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.



త్వరలో రైతులకు శిక్షణ ఇస్తాం

– డి.సురేష్, వరంగల్‌ రూరల్‌ జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ అధికారి  (ఫొటో వస్తుంది) జిల్లాలో భూమి కొనుగోలు పథ«కంలో భూములు పొందిన నిరుపేద ఎస్సీలకు త్వరలో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించాం. వ్యవసాయ శాఖ, పశు సంవర్థక శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, హార్టికల్చర్, భూమి సెల్, ఆర్డీలతో భూ సమస్యలపై రైతులకు అవగాహన కల్పిస్తాం. జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ నుంచి అంద

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top