చక్కెర విక్రయాల్లో చేదు లేదట..!

చక్కెర విక్రయాల్లో చేదు లేదట..!


400 బస్తాల లోడ్‌తో ‘పేట’కు చేరుకున్న చక్కెర లారీ

నామమాత్రంగా పరిశీలించిన వదిలేసిన అధికారులు




నారాయణపేట : స్థానిక పాతగంజ్‌కు గురువారం 400 బస్తాల చక్కెర లోడ్‌తో లారీ చేరుకుంది. ఇందులో 200 క్వింటాళ్ల విలువ చేసే 400 చక్కెర బస్తాలున్నాయి. సంక్రాంతి పండుగ రావడంతో భారీస్థాయిలో కొనుగోళ్లు జరుగుతాయనే వ్యాపార ఏజెన్సీ నిర్వాహకులు పుండలీక చక్కెరను కర్ణాటకలోని బిజాపూర్‌ నుంచి తెప్పించుకున్నారు. అక్రమంగా పెద్దఎత్తున చక్కెర క్రయవిక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు కాళప్ప, జనార్దన్‌ అక్కడికి చేరుకుని.. లారీలో ఉన్న చక్కరను పరిశీలించి వాటికి సంబంధించిన బిల్లులను తీసుకున్నారు. అయితే అందులోని వివరాలు వారికి అర్థం కాకపోవడంతో విషయాన్ని ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ ప్రమీలకు అందజేశారు.


అంతలోపే ఆ విషయం సబ్‌కలెక్టర్‌కు అందినట్లు తెలుస్తోంది. దీంతో రెవెన్యూ అధికారులు ఆ బిల్లులను తీసుకెళ్లి సబ్‌కలెక్టర్‌ కృష్ణాదిత్యాకు చూపించడంతో పూర్తిస్థాయిలో పరిశీలించి వ్యాపారులతో విచారణ చేపట్టాలని వారికి సూ చించారు. బిల్లులను పరిశీలించిన తర్వాత అందులో వే బిల్లులు తప్పా అన్నీ సక్రమంగానే ఉన్నాయని రెవెన్యూ అధికారులు ధృవీకరించి లారీని వదిలిపెట్టారు. అసలు చక్కెర ఇంత పెద్దమొత్తంలో నారాయణపేటలో క్రయవిక్రయాలు జరుగుతుంటే అమ్మక పన్ను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక  నుంచి చక్కెరను దిగుమతి చేసుకున్న తెలంగాణకు కట్టాల్సిన పన్నులు కట్టారో లేదోనని అధికారులు పరిశీలించలేకపోయారు. వారిS అవగాహన లోపంతో ఉన్న బిల్లులను చూసి అవే కరెక్టు అని వ్యాపారులు చెప్పడంతో తల ఊపి పట్టుకున్న లారీని వదిలేశారు. ఆ వ్యాపారి మాత్రం వచ్చిన చక్కెర బస్తాలను గంటల వ్యవధిలోనే విక్రయించడం కొసమెరుపు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top