మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలి

మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలి - Sakshi

పెడదోవ పడుతున్న కళాశాలల యువత 

గంజాయి నియంత్రణకు వివిధ శాఖలకు ప్రత్యేక నిధులు 

రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారుల 

సమావేశంలో డీజీపీ సాంబశివరావు 

రాజమహేంద్రవరం క్రైం :దేశాన్ని టెర్రరిజంలా పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలని రాష్ట్ర డీజీపీ ఎన్‌.సాంబశివరావు పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరంలోని లాహస్పిన్‌ హోటల్‌లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల సాగు, అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై రాష్ట్రంలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో వివిధ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు వినియోగించిన యువత పెడదోవ పడుతోందన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో మారకద్రవ్యాల సాగు, అక్రమ రవాణాపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. విశాఖ రూరల్‌ ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఎక్కువ శాతం గంజాయి అక్రమ సాగు, రవాణా జరుగుతోందని దీనిని అరికట్టేందుకు రైళ్లలో కట్టుదిట్టమైన గస్తీ ఏర్పాటు చేయాలన్నారు. ఏజన్సీలో గంజాయి సాగు గుర్తించేందుకు ఆధునిక పరిశోధన సంస్థ ద్వారా శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా గంజాయి సాగుపై చర్యలు చేపట్టాలన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. సీఐడీ అడిషనల్‌ డీజీపీ సీహెచ్‌ ద్వారాకా తిరుమల రావు, అడిషనల్‌ డీజీపీ రైల్వేస్‌ కె.ఆర్‌.ఎం కిషోర్‌ కుమార్, అడిషినల్‌ డీజీపీ లా అండ్‌ ఆర్డర్‌ హరీష్‌ కుమార్‌ గుప్త, నార్త్‌ కోస్టల్‌ జోన్‌ ఐజీపీ కుమార్‌ విశ్వజిత్, ఐజీపీ సీఐడి (ఇఓడబ్లు్య) అమిత్‌ గార్గ్, విశాఖ సీపీ టి.యోగానంద్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌ కె. వెంకటేశ్వరరావు, డీఐజీ విశాఖ రేంజ్‌ సిహెచ్‌ శ్రీకాంత్, డీఐజీ ఏలూరు రేంజ్‌ పీవీఎస్‌ రామకృష్ణ, రాజమహేంద్రవరం ఎస్పీ బి.రాజకుమారి, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవి ప్రకాష్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ భాస్కర భూషణ్, విజయవాడ రైల్వే ఎస్పీ సిముషిబాజ్‌పై, గుంతకల్లు  రైల్వే ఎస్పీ  ఎం.సుబ్బారావు, విశాఖపట్నం రూరల్‌ ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మ, విజయనగరం ఎస్పీ ఎల్‌.కె.వి.రంగారావు, శ్రీకాకుళం ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, కృష్ణా జిల్లా ఎస్పీ కె. విజయ్‌ కుమార్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top