ప్రజలకు చేరువ కావాలి

ప్రజలకు చేరువ కావాలి - Sakshi


ఎచ్చెర్ల క్యాంపస్‌ : ప్రజలకు పోలీసుల సేవలు చేరువ కావాలని, ప్రజలతో స్నేహ పూర్వకంగా వ్యవహరించాలని కలెక్టర్‌ పి.లక్ష్మీనరసింహం పిలుపునిచ్చారు. ఎచ్చెర్ల ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కార్యాలయంలో సోమవారం ఏఆర్‌ పోలీసుల వార్షిక మొబలైజేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీస్‌ వ్యవస్థ మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. విధి నిర్వహణలో పోలీసులు ఓర్పుగా, సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు.



శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే జిల్లా ప్రగతి సాధ్యమని చెప్పారు. ప్రస్తుతం మారుతున్న నేరాలకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని చెప్పారు. ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి మట్లాడుతూ.. మొబలైజేషన్‌ కార్యక్రమం పునశ్చరణ తరగతులుగా పోలీసులకు ఉపయోగపడుతుందని తెలిపారు. కొత్త విషయాలు నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ భార్గవరావునాయుడు, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసు అధికారులు పాల్గొ న్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top