25, 26 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

25, 26 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - Sakshi

డాబాగార్డెన్స్‌ : ఈ నెల 25, 26 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభోవపేతంగా నిర్వహించనున్నట్టు హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ప్రతినిధి యదురాజ దాస తెలిపారు. వీజే ఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలు ఆయన వెల్లడించారు. ఎంవీపీ కాలనీ ఆళ్వార్‌దాస్‌ గ్రౌండ్‌ వేదికగా జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్టు చెప్పారు. భక్తులు హరేకృష్ణ మహామంత్రాన్ని 108 సార్లు ఉచ్ఛరించాలన్న సంకల్పంతో మండపంలోకి ప్రవేశిస్తారని, మండపం లోపల 108 పలకలు కింద అమర్చబడినట్టు తెలిపారు. భక్తులు 108 సార్లు హరే కృష్ణ హరే కృష్ణ మహామంత్రాన్ని 108 పలకల మీద జపించేలా చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. 25న ఉదయం అభిషేకం, రాత్రి 10 గంటలకు మహాభిషేకం, 26 రాత్రి 7 గంటలకు 108 రకాల వంటకాలతో నైవేద్యం, రాత్రి 8 గంటలకు వ్యాస పూజ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆ రెండు రోజులు సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఊయల సేవ, 4 గంటలకు ధూప హారతి, రాత్రి 7 గంటలకు సంధ్య హారతి, అర్ధరాత్రి 12 గంటలకు మహా మంగళ హారతి కార్యక్రమం ఉంటుందన్నారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా  25 సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ప్రొఫెసర్‌ కె.సరస్వతి విద్యార్థి బృందంచే సంగీత సేవ, 6.15 నుంచి 7.15 గంటల వరకు ద్వారం వెంకట కష్ణ గణేశ త్యాగరాజ్‌ బృందంచే సంగీత సేవ, 7.30 నుంచి రాత్రి 9 గంటల వరకు బాలకొండలరావు బృందంచే కల్యాణ రాఘవం నత్య సేవ, 26 సాయంత్రం 5 నుంచి 6.45 గంటల వరకు డాక్టర్‌ మండపాక శారద బృందంచే సంగీత సేవ, 7 నుంచి 8 గంటల వరకు చైతన్యబ్రదర్స్‌చే సంగీత సేవ ఉంటుందన్నారు. సమావేశంలో చారుగోపాల దాస పాల్గొన్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top