నైపుణ్యం పెంచుకోవాలి


  • వైద్య శాఖ సిబ్బందికి ఏడీఎంహెచ్‌ఓ సూచన

  • ఎంజీఎం : సీహెచ్‌సీ, పీ హెచ్‌సీల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ఆర్గనైజర్లు, హెల్త్‌ ఎడ్యుకేటర్లు, ఆరోగ్య విస్తరణాధికారులు వృత్తిలో నైపుణ్యం మెరుగుపరచుకోవాలని అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ శ్రీరాం సూచించారు. నగరంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో వై ద్యారోగ్య శాఖలోని పలు పథకాల నిర్వహణపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

     

    ఈ సందర్భంగా శ్రీరాం మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలని, ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. మాతా శిశు మరణాలు నమోౖ§ð నప్పుడు  వైద్యాధికారి, ఇతర అధికారులు వాటి కారణాలను పూర్తిగా విశ్లిషించాలని సూచించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కాయకల్ప్‌ కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో మౌలిక వసతుల ఏర్పాటు, సుందరీకరణ, మెరుగైన వైద్యసేవల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అక్టోబర్‌ 2న అవార్డులు ఇస్తామని ప్రకటించారు. దీనిపై శనివారం ఐఎంఏ హాల్‌లో వైద్యాధికారులకు వర్క్‌షాప్‌ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో మాస్‌ మీడియా అధికారి అశోక్‌రెడ్డి, స్టాటిస్టికల్‌ అధికారి కాంతారావు, డిప్యూటీ డెమోలు నాగరాజు, స్వరూపరాణి పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top