పీపీ నియామకంలో అలసత్వం


  • శిరోముండనం కేసులో అడుగడుగునా 

  • నిందితులకు కొమ్ముకాస్తున్న చంద్రబాబు 

  • ప్రభుత్వం  37వ రోజుకు చేరుకున్న  దళితులు నిరాహార దీక్షలు

  • ఒక రోజు దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ బోస్‌

  • రామచంద్రపురం రూరల్‌ : 


    శిరోముండనం కేసులో ప్రభుత్వ తీరును నిరసిస్తు సంఘటన జరిగిన వెంకటాయపాలెంలో దళిత సంఘాల నేతృత్వంలో చేస్తున్న దీక్షలు శుక్రవారం నాటికి 37రోజుకు చేరుకున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ దళితులకు మద్దతుగా వెంకటాయపాలెంలో గురువారం జరిగిన ఒక రోజు  దీక్షలో పాల్గొన్నారు. శిరోమండనం కేసులో వెంటనే పీపీని నియమించి బాధితులకు న్యాయం చేయాలని వారు దళిత సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

    విచారణ నుæ అడ్డుకోవడమే లక్ష్యంగా..

    మండలంలోని వెంకటాయపాలెంలోని సంచలనం రేకెత్తించిన శిరోముండనం కేసులో చంద్రబాబు ప్రభుత్వం అప్పుడూ, ఇప్పుడూ కొమ్ముకాçస్తూనే ఉంది. 20 ఏళ్లుగా కేసు విచారణకు రాకుండా అడ్డుకుంటూ దళితుల మనోభావాలను దెబ్బతీస్తున్నది. దీనిని నిరసిస్తూ దళిత సంఘాలు 37 రోజులుగా దీక్షలు చేస్తున్న ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది.  1996 డిసెంబర్‌ 29న వెంకటాయపాలెంలో ముగ్గురు దళిత యువకులకు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు శిరోముండనం చేయించారన్న ఆరోపణతో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక కోర్టులో ఈకేసు నడుస్తుండగా 1998లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పుట్టు్టస్వామి కమిష¯ŒSను ఏర్పాటు చేసి, ఆ నివేదిక మేరకు మేరకు శిరోముండనం కేసును ఎత్తివేస్తూ జీవోను జారీ చేసింది. బాధితులు మళ్లీ తమకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించగా అది విచారణకు రాకుండా ఎన్నో అడ్డంకులు కల్పిస్తున్నారు. 20 ఏళ్లపాటు  స్టేలను తీసుకువస్తూ సాగదీశారు.  1997 నుంచి ఇప్పటివరకు ఈ కేసులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లుగా నియమితులైన ముగ్గురు మారిపోయారు.  అయితే మొదటి ఇద్దరిలో ఒకరు స్వచ్చందంగా కేసు నుంచి తప్పుకోగా మరొకరు రాజీనామా చేశారు. తాజాగా విశాఖపట్నం స్పెషల్‌ కోర్టులో మరో రెండు రోజుల్లో కేసు విచారణకు వస్తుందనగా సెప్టెంబర్‌ 23న పీపీ జవహర్‌ ఆలీని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనంతటికీ కారణం అధికారంలో ఉన్న  చంద్రబాబు ప్రభుత్వమే. ఇదే విషయాన్ని దళిత సంఘాలూ ఆరోపిస్తున్నాయి.   

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top