పరిశోధనలపై ఆసక్తి కనబరచాలి


  • ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌

  • మహబూబాబాద్‌ రూరల్‌ : విద్యార్థులను విజ్ఞాన శాస్త్ర పరిశోధనల వైపు మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం ఇ¯ŒSస్పైర్‌ కార్యక్రమాన్ని నిర్వహించిందని మహబూబాబాద్‌ ఎంపీఅజ్మీరా సీతారాంనాయక్‌ అన్నారు. మండలంలోని అనంతారం మోడల్‌ స్కూల్లో మూడు రోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి ఇ¯ŒSస్పైర్‌ వైజ్ఞానిక ప్రదర్శన శనివారం సాయంత్రంతో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈసారి   ఇ¯ŒSస్పైర్‌లో స్వచ్ఛభారత్, మేక్‌ ఇ¯ŒS ఇండియా, డిజిటల్‌ ఇండి యా  అంశాలపై ప్రాజెక్టుల ప్రదర్శనలు రూ పొందించటానికి నిర్ణయించటం శుభ సూచకమన్నారు. విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో విద్యతోపాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో, సాం స్కృతిక, క్రీడా రంగాల్లో రాణించి భవిష్యత్‌లో మంచి స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రతి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ పాఠ్యపుస్తకాలతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికి తోడ్పడాలని తెలిపారు. విద్యాశాఖ డివిజ¯ŒS ఉప విద్యాధికారి తోట రవీందర్, జిల్లా సై¯Œ్స అధికారి చెన్నాడి కేశవరావు మాట్లాడుతూ జిల్లా స్థాయి ఇ¯ŒSస్పైర్‌లో పాల్గొన్న 28  ప్రాజెక్టుల ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామన్నారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రాజెక్టుల ప్రదర్శనల జాబితాను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎ¯ŒSఐఎఫ్‌ పరిశోధకురాలు రజినీశర్మ,  ఖమ్మం డీఎస్‌వో సైదులు, అనంతారం సర్పంచ్‌  సుశీల, ఎంపీటీసీ సభ్యురాలు రేఖ యాకమ్మ,  సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు యాకూబ్‌రెడ్డి,  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, ఎంఈవోలు వివేకానంద, భిక్షపతి,  నర్సింహరావు, సృజ¯ŒSతేజ,  వెంకన్న, రత్నమాల, లచ్చిరాం, జిల్లా ఇ¯ŒSస్పైర్‌ రిసోర్స్‌ పర్సన్లు వి.గురునాథరావు, బి.అప్పారావు, టి.శ్రీనాథ్, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ డి.అమరావతి, తదితరులు పాల్గొన్నారు.  
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top