కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి - Sakshi


► కలెక్టర్‌ మాణిక్కరాజ్‌ కణ్ణన్‌



సదాశివపేట: కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం అందించే మద్దతు ధర రూ.1510కు రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని కలెక్టర్‌ మాణిక్కరాజ్‌ కణ్ణన్‌ సూచించారు. సోమవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో ధ్యాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాణిక్కరాజ్‌ మాట్లాడుతూ.. సదాశివపేట ప్రాథమిక వ్యవసాయ పరిపతి సహకార సంఘంలో 2007 మంది సభ్యులున్నప్పటికీ 600 మంది రైతులు మాత్రమే పంట రుణాలు తీసుకున్నారని, 50 మంది లాంగ్‌టర్న్‌ లోన్స్‌ తీసుకున్నారన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో కనీసం 1500 మంది రైతులు పంట రుణాలు తీసుకోవాలని సూచించారు.



అంతేకాకుండా పీఎసీఎస్‌ సొసైటీల్లో సభ్యులుగా ఉన్న రైతులు ఎరువులు, విత్తనాల కొనుగోలు కోసం రూ.5 వేల పంట రుణాలు తీసుకోవచ్చన్నారు. కాగా, రూ.5 వేల పంటరుణం డబ్బులను రైతు చేతికి అందజేమన్నారు. ఈక్రమంలో రైతులు తీసుకున్న రూ.5 రుణానికి ఆరు నెలల తర్వాత రూ.300 వడ్డీ కలిపి చెల్సించాల్సి ఉంటుందని తెలిపారు. ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి అయితే ఈ ఖరీఫ్‌లో ఖర్చు రూ.1000 తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్‌కు ధర రూ.1510, బీ గ్రేడ్‌కు రూ.1470 మద్దతు ధర లభిస్తుందన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులను సూచించారు.



మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ చింతకుంట రాధాభాయి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతోందని చెప్పారు. అనంతరం మార్కెట్‌ కార్యాలయం ఎదుట హమాలీలకు, రైతుల కోసం ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ను కలెక్టర్‌ మాణిక్కరాజ్‌ కణ్ణన్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ తదితరులు ప్రారంభించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, రూరల్‌ బ్యాంక్‌ చైర్మన్లు గడీల అశిరెడ్డి, అంజిరెడ్డి, సివిల్‌ సప్లయ్‌ మేనేజర్‌ విజయ్‌కుమార్, మార్కెట్‌ డీఎం నరేందర్‌రెడ్డి, డీఎస్‌ఓ జితేందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు పెద్దగొల్ల అంజనేయులు, డైరెక్టర్లు తుల్జరామ్, ప్రభుదాస్, రాములు, మల్కయ్య, ఉల్లిగడ్డ విద్యాసాగర్, కొత్త రమేశ్, మార్కెట్‌ కార్యదర్శి శ్రీధర్, సూపర్‌వైజర్‌ శ్రీనివాస్, పీఎస్సీస్‌ సీఈఓ విజయ్‌కుమార్, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కొత్తగొల్ల కృష్ణ, ప్రధాన కార్యదర్శి చిన్న, యువత అధ్యక్షుడు విరేశం, మండల కో–ఆప్షన్‌ మెంబర్‌ సలావుద్దీన్, రైతులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top