పాఠశాల విద్యార్థినుల ఆందోళన

పాఠశాల విద్యార్థినుల ఆందోళన - Sakshi


సర్టిఫికెట్‌లు ఇవ్వడం లేదని ఆరోపణ 



నరసరావుపేటటౌన్‌: టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు విద్యార్థినులు పాఠశాల ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. పోలీసుల రంగప్రవేశంతో  ఆందోళన విరమించారు. టూటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం హర్డ్‌ బాలికల పాఠశాలలో గత విద్యాసంవత్సరం పదోతరగతి పూర్తిచేసుకొన్న విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం టీసీలు ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. విద్యార్థులు తిరిగి అదే పాఠశాలలో నిర్వహిస్తున్న కాళాశాలలో చదవాలనే ఉద్ధేశంతో పాఠశాల యాజమాన్యం వారికి టీసీలు ఇవ్వడం లేదు. ఇది గ్రహించిన విద్యార్థులు గురువారం పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.



సమాచారం అందుకొన్న సీఐ సాంబశివరావు అక్కడకు చేరుకొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ టీసీలు, మార్కుల సర్టిఫికెట్ల కోసం ఎన్నిసార్లు పాఠశాలకు వచ్చినా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారని ఆరోపించారు. ఇప్పటికే తాము ఇతర కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నామని అక్కడి యాజమాన్యం టీసీలు లేనిదే తరగతులకు అనుమతించమని చెబుతున్నారని చెపాపరు. గట్టిగా ప్రశ్నిస్తే తమ కళాశాలలోనే చదవాలని చెబుతున్నారని విద్యార్థులు వాపోయారు. ఈ వ్యవహారంపై పాఠశాల యాజమాన్యంతో చర్చింది. తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ప్రిన్సిపల్‌  పాఠశాలలో అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లో సీఐ ఆమెతో సంప్రదింపులు చేశారు. ఆమె వెంటనే పాఠశాలకు ఫోన్‌చేసి విద్యార్థులకు కావలసిన సర్టిఫికెట్‌లను అందించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. దీంతో విద్యార్థులు ఆందోళనను విరమింపజేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top