గాలిపటమా పద పద..ఆకాశమే హద్దుగా

గాలిపటమా పద పద..ఆకాశమే హద్దుగా - Sakshi


► మొదలైన సంక్రాంతి సందడి  

► మార్కెట్లో రకరకాల గాలిపటాలు 

►చిన్నారుల్లో అంతులేని ఆనందం




ఆదిలాబాద్‌ కల్చరల్‌: వానాకాలంలో ఆకాశంలో రంగురంగుల ఇంద్రధనస్సు దర్శనమిచ్చే సందర్భాలను మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. అందులోని ఏడు రంగులను చూసి ఎంతో మురిసిపోతాం. అదే సంక్రాంతి పండుగకు మాత్రం వానతో సంబంధం లేకుండానే ఎన్నో రకాల రంగులతో, విభన్న ఆకారంలో ఆకట్టుకునే విధంగా విభిన్న ఆకృతులతో తయారు చేసినపతంగులు ఆకాశంలో దర్శనమిస్తున్నాయి. సంక్రాతి పర్వదినం మూడు రోజుల ముచ్చటైన పండగకు చిన్న పెద్దలు అందరు ఆనందోత్సహాలతో పతంగులను ఎగురవేస్తూ నిత్యజీవితంలో ఆనందాన్ని పోందుతుంటారు. ఈ పతంగులను ఎగురవేస్తూ జాగ్రత్తగా వ్యహరిస్తూ మధుర జ్ఞాపకాలు జీవితంలో ఉంటాయి.



పతంగుల కథాకమామీషు..

పతంగుల పండగ నిజాం కాలంలో గోప్ప ఆదరణపొందింది . దీని పుట్టుక ఆసక్తికరమే. సముద్ర తీర ప్రాంతాలు, మైదానాలు , ఎడారుల్లో గాలి తీవ్రతనువాటాన్ని తెలుసుకునేందుకుఆ రజుల్లో తేలికపాటి వస్తువులను గాలిలో ఎగురవేసేవారు. అవే పతంగుల పుట్టకకు కారణమయ్యాయని చెబుతుంటారు. రాజస్థాన్ లోని అల్వర్‌కు చెందిన మౌజీ 1872 లో మొట్టమొదటి సారిగా పిల్లల సరదా కొసం పతంగాన్ని ఎగురవేసనట్లుచెబుతుంటారు. అలా ఉత్తరాదిలో పుట్టిన పతంగి దక్షిణాది  సంస్కృతిలోభాగమైపోయిందనే కథనం ఉంది. నిజాం కాలంలోపతంగుల పోటీలను కుల, మతాలకతీతంగా నిర్వమించడం వల్ల అన్ని ప్రాంతాలోల  పతంగులను ఎగురవేయడం ప్రారంభం కాగా, ఇప్పటికి ప్రతి ఒక్కరూ పతంగులను ఎగురవేస్తున్నారు.



విభిన్నరకాలుగా..

సంక్రాంతి అంటేముగ్గులు, గొబ్బిళ్లు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఉండగా, వీటితోపాటు మరో ముఖ్యమైనది పతంగులు. సంక్రాంతి పేరుచెప్పగానే ఠక్కున చిన్నారులకు గుర్తుకోచ్చేది పతంగులే. నింగిలో రంగురంగుల గాలిపటాలు ఆకాశవీధిలో విన్యాసాలు చేస్తుంటే చిన్నారులతో పాటు పెద్దలకు కూడా ఆనందోత్సహంలో ముచ్చెత్తుతుంది. సినీహీరోలు, సీఎం, పీఎం ,పక్షలు, సీతాకోకచిలుకలు. కార్టూన్ బోమ్మలు, చోటాభీమ్‌ వంటి విభిన్న రకాల గాలిపటాలు అందుబాటులో ఉన్నాయి. కళాకారులు తమకళాత్మకంగా తయారుచేయడంతో ఈ గాలిపటాలు మైదానాలలో హరివిల్లుల అగుపిస్తున్నాయి.



మాంజా స్థానంలో తంగూన్ ..

పతంగులను ఎగురవెసేందుకు వినియోగించే మాంజా ఇప్పుడు లబించడం లేదు. చైనా నుంచి టన్నుల కొద్ది దిగుమతి అవుత్ను తంగూన్ (సన్నటి వైరు), మాజానుకబలించింది.  ఆ రోజుల్లో మాంజా తయారు చేయడం ఒక కళ. ఇందుకోసం గ్రామాల్లో ప్రత్యేకంగా కొంతమంది సంక్రాంతి పండగ సమయంలో దీనిని తయారు చేసేవారు. అన్నం మెత్తగా రుబ్బి, దానికి బెండకాయరసం, గుడ్డు, సీసం, రంగులు కలిపి దారానికి రుద్దేవాళ్లు. పదినిమిషాలు ఆరబెడిత  మాం జా తయారయ్యేది. ఇది మెత్తగా పతంగులను ఎగురేసెందుకు అనుకూలంగా ఉండేది. తంగూన్ తో తరుచూ చేతులకు గాయాలవుతున్నట్లు చిన్నారులు చెబుతున్నారు.



అందుబాటు ధరల్లో

పతంగులు పరిమాణం, నాణ్యత, రంగులను బట్టి ధరలు ఉన్నాయి. ప్రత్యేకగా వస్రా్తలతో తయారుచేసిన పతంగుల ధరలు అత్యధికంగా వందల్లో ధర ఉండగా , ప్లాస్టిక్‌తోచేసిన పతంగులు రూ. 5 నుంచి మొదలుకుని రూ. 100 వరకు లభ్యమవుతున్నాయి. వీటితో పాటు ప్లాస్టిక్‌ దారం.ప్రత్యేకంగా తయారు చేసిన మాంజాదారం మీటర్ల ధరలతో విక్రయిస్తున్నారు.  రూ. 10 నుంచి 300 వరకు మాంజధారాలు లభిస్తున్నాయి.



జాగ్రత్త తప్పని సరి..

►  గాలిపటాలను వీలైనంత  మైదానాల్లోనే ఎగురవేయాలి

►  మేడలపైన, చెట్ల పైన,  ఓవర్‌హెడ్‌ట్యాంకుల పై నుంచి ఎగురవేయ వద్దు

►  పిట్టగోడలు లేని  మేడల పైకి పతంగులు ఎగురవేయడం శ్రేయస్కరం కాదు.

► చెట్లపై చిక్కుకున్న పతంగులను తీయాలనే ప్రయత్న చేయవద్దు, కోమ్మలకు వేలాడుతూ పతంగులను తీయకూడదు.

► రైలు పట్టాల సమీపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పతంగిని ఎగురవేయవద్దు

►  బస్సులు, లారీలు వెళ్లే ప్రదాన మార్గాల్లో కూడా గాలిపటాలు ఎగరువేయ వద్దు.

►  చైనా మాజాను వినియోగించవద్దు.దాంతో పక్షలకు ప్రాణాలకు ప్రమాదం. ప్రభుత్వం ఆ మాంజాలను నిషేదించింది.

► విద్యుత్‌ వైర్లకు అతుకున్న పతంగులను తీయడానికి ప్రయత్నం చేయవద్దు

► పిల్లలు పతంగులు ఎగురవేసేప్రాంతాలను తల్లిదండ్రులు జాగ్రత్తగా పరిశీలించాలి. గుంతలు , చెరువుకట్టలు, కాలువ కట్టల వద్దకు వెళ్లనివ్వకుండా చూడాలి.

► దారం తెగిపోయి గాలిలో ఎగిరిపోతున్న పతంపగిని పట్టుకోవాలని వీధుల్లో, రహదారిమీద  పరుగులు తీయవద్దు.  దీని వల్ల వాహానాలు ఢీకొని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top