వెట్టి బతుకులు

వెట్టి బతుకులు


l    కనీస వేతనాలు కరువైన గ్రామపంచాయతీ సిబ్బంది

l    ఉద్యోగ భద్రత లేక భారంగా విధులు

l    తక్కువ ఆదాయం ఉన్న పంచాయతీ కార్మికులను ఆదుకోని జీఓ 63

l    రూ.లక్ష లోపే ఆదాయంతో వేతనాలు రూపంలో యాభై శాతం తీసుకోలేని వైనం

l    జిల్లాలో 269 జీపీలు, 1100 మంది సిబ్బంది




గీసుకొండ(పరకాల): పల్లెలు పరిశుభ్రంగా ఉండాలని, వంద శాంతి ఇంటి పన్నులు వసూలు కావాలని, స్థానిక పరిపాలన సజావుగా సాగాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. వీటన్నింటినీ సాకారం చేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీ ఉద్యోగుల జీవితాలు మాత్రం బాగుపడడం లేదు. చాలీచాలని వేతనాలతో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వారు వెట్టి బతుకులు బతుకుతున్నారు. గ్రామాల్లో పనిచేసే కారోబార్లు, పంపు ఆపరేటర్లు, సఫాయి కార్మికులు, స్వీపర్లు, ఎలక్రీషియన్లు, పంప్‌ ఆపరేటర్లు ఇలా పేరు ఏదైనా అందరూ గ్రామపంచాయతీ సిబ్బంది కిందకే వస్తారు. గడిచిన 20ఏళ్లుగా పని చేస్తున్న వీరికి ఇప్పటి వరకు ఉద్యోగ భద్రత లేకపోగా.. కనీస వేతనం అందకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు.


పనికి రాని జీఓ

గ్రామపంచాయతీ సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించా ల నే డిమాండ్‌తో కొద్దిరోజుల క్రితం నెల పాటు సమ్మెకు ది గారు. దీంతో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఏడాది తర్వాత జీఓ 63ను జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం పంచాయతీలకు వచ్చే ఆదాయం నుంచి యాభై శాతం మేర కార్మికులు వేతనంగా తీసుకోవచ్చు. కానీ వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 269 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో 1100 మంది వర కు వరకు ఉంటారు. వీరికి రూ.500 నుం చి రూ.3వేల వరకు వేతనం ఇస్తున్నారు.


అయితే, ఇవి కూడా ప్రతీనెలా అందడం లేదు. జిల్లాలో కొన్ని పంచాయతీల్లో ఏడాది ఆదాయం రూ.40 వేల నుంచి రూ.లక్ష మేరకు ఉంటుంది. అయితే, ఈ ఆదాయం నుంచి సిబ్బందికి 50 శాతం వేతనాలు రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం జీఓ జారీ చేసినా.. ఇవ్వలేని పరిస్థి తి. ఏమంటే 50 శాతం వేతనాలు రూపంలో చెల్లిస్తే మిగతా నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదు. ఎక్కువ ఆదాయం ఉన్న పంచాయతీల్లో ఈ జీఓ ఉపయుక్తమే అయినా.. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పంచాయతీల సిబ్బందికి మాత్రం మేలు జరగడం లేదు.


పని చేసేది, అందుబాటులో ఉండేది వారే...

గ్రామంలో ఏ పని చేయాలన్నా పంచాయతీ సిబ్బంది అందుబాటులో ఉండాల్సిందే. అధికారులు, ప్రజాప్రతినిధులకు సహకారం అందిస్తూ గ్రామ పాలనలో కీలకంగా వ్యవహరిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంత కీలకంగా ఉన్న వారి వేతనాలు, సమస్యల పరిష్కారంపై ఎవరికీ పెద్దగా పట్టింపు ఉండటం లేదు.


ఇవీ సిబ్బంది డిమాండ్లు

వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పంచాయతీ సిబ్బంది తమ సర్వీసులను క్రమబద్ధీకరించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభు త్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రేడ్‌–4 పంచాయతీ కార్యదర్శుల నియామకంలో 30 శాతం పంచాయతీ సిబ్బందికి అవకాశం కల్పించాలని, పంచాయతీల ఆదాయం నుంచి కాకుండా నేరుగా ప్రభుత్వమే వేతనాలను చెల్లించాలని కోరుతున్నారు. ఇంకా 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పంచాయతీ సిబ్బందికి 30 శాతం కేటాయించాలని కోరుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top