దొంగల ముఠా అరెస్ట్ : బంగారం స్వాధీనం


చిత్తూరు : జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన దొంగల ముఠా గుట్టును పోలీసులు గురువారం రట్టు చేశారు. ముఠాలోని ముగ్గురు దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 180 గ్రామలు బంగారు ఆభరణాలతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.


ముఠాకి చెందిన ఇద్దరు మహిళలతోపాటు ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి...  ఎక్కడెక్కడ దొంగతనాలు చేశారనే విషయాలను వారి నుంచి రాబట్టుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top