కాంట్రాక్టర్‌ కోసం ప్రజలను బలిచేస్తున్నారు


  • వైఎస్సార్‌సీపీ రూరల్‌ కో ఆర్డినేటర్‌ గిరిజాల బాబు

  • రోడ్డు విస్తరణ పనుల నిర్లక్ష్యంపై పార్టీ శ్రేణుల ధర్నా

  • కడియం : 

    కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకు కెనాల్‌ రోడ్డు వెంబడి నివసిస్తున్న ప్రజల ప్రాణాలను రాష్ట్ర ప్రభుత్వం పణంగా పెట్టిందని వైఎస్సార్‌ సీపీ రాజమహేంద్రవరం రూరల్‌ కో ఆర్డినేటర్‌ గిరజాల వీర్‌ారజు (బాబు) ఆరోపించారు. కెనాల్‌ రోడ్డు నిర్మాణం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వేమగిరి కొత్తపేట వద్ద రోడ్డుపై రెండు గంటల పాటు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు మంగళవారం ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా గిరిజాల బాబు మాట్లాడుతూ ఇక్కడకు సమీపంలో సగం రోడ్డు కాలువలోకి జారిపోయిందన్నారు. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఈ రోడ్డు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు.  

     2013లో చేపట్టిన ఈ రోడ్డు విస్తరణ పనులు ఈ మూడేళ్లలో కేవలం ఐదు శాతమే పూర్తయ్యాయని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంకు వైదొలగిందని గిరజాల చెప్పారు. కడియం ఎస్సై ఎం. సురేష్‌బాబు ధర్నా వద్దకు చేరుకుని గిరజాల తదితరులతో చర్చించినా వారు ఆందోళన విరమించలేదు. దీంతో రాజమహేంద్రవరం దక్షిణ మండలం డీఎస్పీ నారాయణరావు అక్కడకు చేరుకుని మాట్లాడారు. అనంతరం ఆర్‌అండ్‌బీ ఈఈ రాఘవరావుతో ఫో¯ŒSలో చర్చించారు. నవంబరు మొదటి వారంలో రోడ్డు మరమ్మతులు ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ గడవులోగా పనులు ప్రారంభం కాకపోతే ఆమర నిరాహార దీక్షకు దిగుతానని గిరజాల బాబు హెచ్చరించి, ఆందోళన విరమించారు. ధర్నాలో పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి దాసరి శేషగిరి, పార్టీ నాయకులు చిక్కాల ఉమామహేశ్వరరావు, మీర్జా ఆలీ, ఎలుగొండ లక్ష్మి, పెరుగు నాగేశ్వరరావు, ఎ¯ŒSవీ శేఖర్, జిల్లా కార్యదర్శి ఈలి గోపాలం, సాపిరెడ్డి కామేశ్వరరావు,  దొంతంశెట్టి వీరభద్రరావు,  గారపాటి బుజ్జిబాబు, ముద్రగడ ప్రసాదు, కప్పల భాస్కరరావు, కేవీ రావు,  దండగల మరిడయ్య, ఒంటెద్దు కృష్ణ, వరసాల మూర్తి, గాడ తాతారావు, మామిడి మోరిస్, ఉప్పులూరి హనుమంతరావు,  దంగుడుబియ్యం సత్యనారాయణ, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, ఆలమూరి శ్రీనివాసరావు, బత్తుల రాజు తదితరులు పాల్గొన్నారు. ధర్నాకు ముందు గిరిజాల బాబు పార్టీ సమావేశం నిర్వహించారు. 

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top