వీసీ తొలగింపు.. ప్రిన్సిపాల్ పై వేటు

వీసీ తొలగింపు.. ప్రిన్సిపాల్ పై వేటు - Sakshi


హైదరాబాద్:నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి కేసుకు సంబంధించి సుబ్రహణ్యం కమిటీ అందజేసిన నివేదికన ఏపీ ప్రభుత్వం బహిర్గతం చేసింది. శనివారం రిషితేశ్వరి ఆత్మహత్య కేసుకు సంబంధించి నివేదికను కమిటీ ప్రభుత్వానికి అందజేసిన సంగతి తెలిసిందే.   ఈ నివేదికలో పలువిషయాలను ఆదివారం మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. ర్యాగింగ్ కారణంగానే రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు కమిటీ పేర్కొన్నట్లు ఆయన స్పష్టం చేశారు. నైతికత, మానవీయతలేని విపత్కర పరిస్థితుల్లో.. మానసికంగా కృంగిపోయిన రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందన్నారు. భవిష్యత్ లో ర్యాగింగ్ అన్నపదం ఉచ్ఛరించడానికి భయపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు గంటా తెలిపారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఇంఛార్జి వీసీ సాంబశివరావు తొలగించడమే కాకుండా.. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావును డిస్మిస్ చేసినట్లు గంటా తెలిపారు.



గంటా మీడియాకు తెలిపిన నివేదికలోని అంశాలు..

 


*రిషితేశ్వరి ఆత్మహత్యకు ర్యాగింగే కారణమని నిర్దారణ అయ్యింది

*ప్రిన్సిపాల్ బాబూరావును విచారించమని కమిటీ చెప్పింది

*బాబురావును డిస్మిస్ చేసి... పోలీస్ విచారణకు ఆదేశించాం

*ఆరోపణలు నిజమని తేలితే బాబూరావును ప్రాసిక్యూట్ చేస్తాం

*ర్యాంగింగ్ లో మరికొంతమంది పేర్లు కూడా ఉన్నట్లు పేర్కొన్న కమిటీ నివేదిక

*హస్టల్లో రక్షణ లేదు.. పూర్తిస్థాయి వార్డెన్ కూడా లేరు

*యూనివర్శిటీలో అనేక వ్యవస్థాపక లోపాలున్నాయి

*ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని కమిటీ సూచించింది

*ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తాం

*స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేయాలని కమిటీ పేర్కొంది

*ర్యాగింగ్ నిరోధానికి సెలబ్రిటీలు, ఫిల్మ్ స్టార్లతో ప్రచారం

*యూనివర్శిటీల్లో బయట వ్యక్తులను లోనికి రాకుండా నియంత్రించాలి

*యూనివర్శిటీల్లో గుర్తింపు కార్డులు తప్పనిసరి

*యూనివర్శిటీల్లో కులసంఘాలు లేకుండా చర్యలు

*అవసరమైతే పోలీస్ అవుట్ పోస్ట్ లను  ఏర్పాటు చేస్తాం

*షీ టీమ్ లు, టోల్ ఫ్రీ నంబర్లు.. మఫ్టీల్లో మహిళా పోలీసులను ఏర్పాటు చేస్తాం

*మూడు యాక్ట్ ల కింద రిషితేశ్వరి కేసు విచారణ

*యూనివర్శిటీలో ఇష్టారాజ్యంగా పరిస్థితులు

*నాగార్జున యూనివర్శిటీ ఇంఛార్జి వీసీ సాంబశివరావు తొలగింపు

*ఐఏఎస్ అధికారిని ఉదయలక్ష్మిని ఇంఛార్జి వీసీగా నియమిస్తున్నాం

*170 మంది విద్యార్థులను విచారించం

*వర్శిటీ పెద్దలను విచారించారు

*అన్యాయాలకు, అక్రమాలకు అడ్డగా వర్శిటీ మారింది

*పోలీసులు పూర్తిస్థాయి విచారణ ఆదేశం.. అనంతరం నిందితులపై చర్యలు

*నిందితులు ఎక్కడా చదువుకోకుండా చర్యలు

*ప్రెషర్స్ పార్టీని బయట ప్రాంతాల్లో కాకుండా కళాశాలల్లోనే నిర్వహించేలా చర్యలు

*చాలా రోజుల తర్వాత బయట ఫ్రెషర్స్ డే పార్టీని నిర్వహించడం కూడా రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణం


*నియమాలు, నిబంధనలు ఆర్కిటెక్చర్ కాలేజీలో లేవు, సరైన భద్రతా వ్యవస్ధలు కూడా లేవు

*అన్యాయాలకు, అరాచకాలకు ఒక అడ్రస్ లా యూనివర్శిటీ తయారైంది

*ఆర్కిటెక్చర్ కోర్సులో 50 శాతం మార్కులు ప్రిన్సిపాల్ చేతిలో ఉన్నాయి

*ఎవరైనా ఫిర్యాదు చేసినా భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయం విద్యార్థుల్లో ఉన్న మాట వాస్తవమే

*సీనియర్ విద్యార్థులు, కొంతమంది అధ్యాపకులు కలసి వేధింపులకు గురి చేస్తున్నారు

*దీనిపై కూడా కమిటీ దృష్టి సారించింది

*ఇక నుంచి రాత్రిపూట యూనివర్శిటీల్లో ఆకస్మిక తనిఖీలు


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top