మనుషులుగా చూడండి

మనుషులుగా చూడండి - Sakshi


అధికారుల బాధ్యతారాహిత్యమే సమస్యకు మూలకారణం

తిరుపతిలోనే చెత్త ఉండాలని కోరుకోవడం లేదు

ప్రజలకు, పల్లెలకు దూరంగా డంపింగ్‌ యార్డు పెట్టాలి

సమస్యను పెద్ద మనస్సుతో ఆలోచించండి

తిరుపతి ప్రజలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి వినతి




తిరుపతి రూరల్‌: రామాపురంలోని డంపింగ్‌యార్డును తరలించాలని గ్రామస్తులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించి ఎమ్మెల్యే చెవిరెడ్డి చేపట్టిన నిరవధిక నిరసన బుధవా రం రెండో రోజు కూడా కొనసాగింది. సా యంత్రం నిరసన శిబిరం వద్ద ఆయన విలేకరుల సమావేశంలో గ్రామస్తులతో కలిసి మాట్లాడారు. రామాపురంలోని డంపింగ్‌ యార్డు తరలించాలని ఇక్కడ ప్రజలు ఐదేళ్లుగా పోరాడుతున్నారన్నారు. ఈ అందోళనల నేపథ్యంలోనే 2012లో తిరుపతి కమిషనర్, అడిషనల్‌ కమిషనర్, హెల్త్‌ ఆఫీసర్‌ విచా రించి, సమస్య తీవ్రతను గుర్తించి, మూడు నెలల్లో యార్డును తరలిస్తామని రాతపూర్వకంగా ఇచ్చింది వాస్తవమా, కాదా అని ప్రశ్నించారు. ఐదేళ్లు అయినా ఎందుకు తరలించలేదో...కనీసం ప్రయత్నం కూడా ఎం దుకు చేయలేదో కార్పొరేషన్‌ అధికారులు తిరుపతి ప్రజలకు సమాధానం చెప్పాలన్నా రు.



బోరులోని నీటిని పబ్లిక్‌ హెల్త్‌ విభాగం పరీక్షించగా బ్యాక్టీరియా ఉందని, తాగడానికి పనికిరావని ల్యాబ్‌ అధికారులు నిర్థారించిం ది వాస్తవమా, కాదా? అన్నారు. ప్రభుత్వ వైద్యా«ధికారులు ఇచ్చిన నివేదిక కారణంగానే నాటి జిల్లా కలెక్టర్‌ తిరుపతి డివిజన్‌ పరిధిలోని ప్రజలకు దూరంగా 50 ఎకరాల స్థలాన్ని సేకరించి అక్కడికి యార్డును తరలించాలని మున్సిపల్, రెవెన్యూ అధికారులను అధికారిక ఉత్తర్వుల్లో ఆదేశించిన విషయాన్ని తిరుపతి ప్రజలకు తెలపకుండా ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు.  ‘ఆసుపత్రి, మాంస వ్యర్థాలు, కోళ్లు, కుక్కలు, జంతు కళేబరాలు, అనాథ శవాలతో కూడిన రోజుకు 178 టన్నుల చెత్తను మా గ్రామాల మధ్య వేస్తుంటే భరించమంటారా? మీరే న్యాయం చెప్పండంటూ తిరుపతి ప్రజలకు విన్నవించుకుంటున్నానన్నారు. ‘మా గ్రామాల్లో చెత్తవేయకండంటే తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ మండిపడుతున్నారు.



ఎక్కువ మాట్లాడితే గ్రామ ప్రజలను జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారు. ఇది న్యాయమా? తిరుపతి ప్రజలు ఆలోచించాలన్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్‌ అధికారులు నిర్లక్ష్యం వీడి, రాజకీయ ఎత్తుగడలు, బెదిరింపులు మాని రెండు నియోజకవర్గల్లోని చెత్త సమస్యను సృష్టించాలనే ఆలోచనలు వీడాలన్నారు.  ప్రజలకు, పల్లెలకు దూరంగా డంపింగ్‌ యార్డుని ఏర్పాటు చేయాలని, తిరుపతి ప్రజలు పెద్ద మనస్సుతో  సమస్యను అర్థం చేసుకోవాలని చెవిరెడ్డి కోరారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top