అరుదైన నాగుపాము హతం



మందస: సర్పాల్లో అత్యంత అరుదైన వైరాగినాగును గ్రామస్తులు అంతం చేశారు. అరణ్యాల్లో, పెద్ద పెద్ద కొండల్లో మాత్రమే సంచరించే ఈ పాము తోకను నేలపైనుంచి తలతో పాటు శరీరం మొత్తం గాలిలో నిలబెడుతుంది. జంతువులను సైతం మింగేసే ఈ పాము కాటు అత్యంత ప్రమాదకరం.


 


సుమారు 13 అడుగుల పొడవున్న ఈ వైరాగినాగు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా మందస మండలం లక్ష్మీనారాయణపురం వద్ద జనారణ్యంలోకి వచ్చింది. అది చూసిన స్థానికులు భయాందోళన చెందారు. ఓ ఇంటిలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా కొంతమంది రైతులు ధైర్యంతో ముందుకు వెళ్ళి హతమార్చారు. సమీపంలోనే మహేంద్ర గిరులు ఉండటంతో అక్కడి నుంచి వచ్చి ఉంటుందని వారు భావిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top