రామన్నపేటను డివిజన్‌ కేంద్రంగా మార్చాలి

రామన్నపేటను డివిజన్‌ కేంద్రంగా మార్చాలి

రామన్నపేట

పాత అసెంబ్లీ నియోజకవర ్గకేంద్రమైన రామన్నపేటను రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా మార్చాలని మండల సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. రామన్నపేట మండలం నూతనంగా ఏర్పడే యాదాద్రి జిల్లాలో కలుస్తుందని, జిల్లాకు చివర నుండే రామన్నపేట భవిష్యత్తులో ఇంకా వెనుకబడే అవకాశం ఉందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచనాదినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తీర్మానించారు. మునిపంపుల వైద్యాధికారి, సిబ్బంది çసక్రమంగా విధులకు హాజరుకావడం లేదని జెడ్పీటీసీ జినుకల వసంత ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతం కావడంవల్ల కొంత ఇబ్బంది కలుగుతుందని వైద్యాధికారి బదులివ్వడంతో ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి జోక్యంచేసుకొని మండలకేంద్రానికి 7కిలోమీటర్ల దూరంలో ఉన్న మునిపంపుల మారుమూల ప్రాంతం ఎలా అవుతుందని, అలాంటప్పుడు ఉద్యోగాలు మానుకోవాలని తీవ్రంగా స్పందించారు.  రెవెన్యూ శాఖ పనితీరును వివరించేందుకు డీటీ జె.ఎల్లేశం వేదికవద్దకు రాగా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.   రెవెన్యూశాఖ పనితీరుపట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తూ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. 

 

కాలువల ఆధునికీకరణకు రూ.350కోట్లు : ఎమ్మెల్యే 

భువనగిరి డివిజన్‌లోని నాలుగు సాగునీటి కాలువల ఆధునికీకరణకు రూ.350కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.  మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  రైతులకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరమ్మత్తులు చేయడం జరుగుతుందని చెప్పారు.   మూడవవిడత మిషన్‌కాకతీయపనుల ఎంపికలో స్థానిక ప్రజాప్రతినిధులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఏరియా ఆసుపత్రిలో విధులపట్ల నిర్లక్ష్యం వహించే డాక్టర్లు, సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో ఎంపీడీఓ కె.జానకిరెడ్డి, వైస్‌ఎంపీపీ బద్దుల ఉమారమేష్, సభ్యులు ఆకవరపు మధుబాబు, పున్న వెంకటేశం, కూరెళ్ల నర్సింహాచారి, చల్లా వెంకట్‌రెడ్డి బండమీది సరిత, ఊట్కూరి శోభ, సాల్వేరు రోజ, బండ పద్మ, మేకల భద్రమ్మ, మంటి సరోజ, వెలిజాల లక్ష్మమ్మలతోపాటు, వివిధగ్రామాల సర్పంచ్‌లు, వివిధశాఖల అధికారులు హాజరయ్యారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top