'ర్యాగింగ్ లేని రాష్ట్రంగా ఏపీ'

'ర్యాగింగ్ లేని రాష్ట్రంగా ఏపీ'


ర్యాగింగ్ రుజువైతే విద్యకు శాశ్వతంగా దూరం



విజయవాడ సెంట్రల్: ఆంధ్రప్రదేశ్‌ను ర్యాగింగ్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ.. ర్యాగింగ్‌కు పాల్పడితే శాశ్వతంగా విద్యకు దూరం చేస్తామన్నారు. బయోమెట్రిక్, సీసీ కెమెరాలతో ర్యాగింగ్‌ను కట్టడి చేయనున్నట్లు పేర్కొన్నారు. వైస్‌చాన్స్‌లర్ లే యూనివర్సిటీకి కింగ్ అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎక్కడైనా రాజకీయ జోక్యంతో ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీల్లో విద్యావిధానాన్ని అధ్యయనం చేయడం కోసం త్వరలోనే సింగపూర్, అమెరికా, ఫ్రాన్స్, చైనా, ఫిన్‌ల్యాండ్ దేశాలతో పాటు దేశంలోని తమిళనాడు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు.



పొట్టిశ్రీరాములు, అంబేద్కర్ యూనివర్సిటీల విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని మంత్రి గంటా అన్నారు. విద్యార్థుల ఫలితాలను విడుదల చేయాల్సిందిగా తాము లేఖ రాసినా స్పందించలేన్నారు. నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి, వైఎస్ఆర్ జిల్లా నారాయణ విద్యాసంస్థలో విద్యార్థిని మృతిపై అసెంబ్లీలో ప్రతిపక్షం లేవనెత్తే ప్రశ్నలకు అన్ని రకాలుగా సమాధానం చెప్పేలా రికార్డులు సిద్ధం చేయాలని మంత్రి వీసీలకు సూచించారు. నారాయణ క్యాబినెట్‌లో మంత్రిగా ఉండటంతో పాటు తన బంధువు కూడా కావడంతో అసెంబ్లీలో ప్రతిపక్షం టార్గెట్ చేస్తోందన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top