పుష్కర ఘటనపై సా..గుతున్న విచారణ

పుష్కర ఘటనపై సా..గుతున్న విచారణ

 

రాజమహేంద్రవరం క్రైం : 

పుష్కర తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్‌ సోమయాజులు కమిష¯ŒS విచారణ కొనసాగుతూనే ఉంది. విచారణ ఈ నెల 28 కి వాయిదా వేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్‌ అండ్‌ బి అతిథిగృహంలో పుష్కర తొక్కిసలాట ఘటనపై జస్టిస్‌ సోమయాజులు  కమిష¯ŒS విచారణ నిర్వహించింది. పుష్కరాల సమయంలో తీసిన ఫొటోలు, సీడీలు, కొన్ని డాక్యుమెంట్లను సమాచార శాఖ కమిషన్‌కు సమర్పించింది. వాటిని తమకు ఇవ్వాలని కమిష¯ŒSను పౌరహక్కుల సంఘం నాయకుడు, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అభ్యర్థించారు.  అనంతరం ఈ నెల 28 కి విచారణను వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ సోమయాజులు ప్రకటించారు. కమిష¯ŒS గడువు ఈ నెల 29 తో ముగియనుంది. అనంతరం న్యాయవాది  ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ పుష్కర తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం కమిష¯ŒS వేస్తూ 6 నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని గడువు విధించి ఏడాదిన్నర కావస్తున్నా అధికారులు కమిష¯ŒSకు పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించలేదన్నారు.  ఈ సంఘటన కు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు ఇవ్వలేదని, నేషనల్‌ జియోగ్రఫీ చానల్‌లో కూడా పూర్తిస్థాయి ఆధారాలు సమర్పించకుండా ఎడిట్‌ చేసి ఇచ్చారన్నారు. 

సీఎం స్నానానికి అనుమతి ఇచ్చిందెవరు?

వీఐపీ ఘాట్‌ ఉండగా పుష్కర ఘాట్‌ లో సీఎం చంద్రబాబు నాయుడు స్నానం చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారని ముప్పాళ్ల ప్రశ్నించారు. పుష్కర ఘాట్‌ లో బారికేడ్లు ఎవరి ఆదేశాల మేరకు తొలగించారో చెప్పాలన్నారు. సంఘటన సమయంలో పుష్కర ఘాట్‌లో ఆక్సిజ¯ŒS అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కువ మంది మృత్యువాతపడ్డారని అన్నారు. ఈ సంఘటనలో 170 మంది బాధితులను విచారించామని చెబుతున్న పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించలేదని అన్నారు. కమిష¯ŒS గడువు ఈనెల 29 తో ముగుస్తున్నందున  ఆ లోగా అన్ని శాఖలు పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించి బాధ్యులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది సీహెచ్‌ ప్రభాకరరావు, కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ చైర్మ¯ŒS కూనపురెడ్డి శ్రీనివాస్, డీపీఆర్‌ఓ వెంకటేశ్వరరావు, రాజమహేంద్రవరం రూరల్‌ తహసీల్దార్‌ కె.భీమారావు,  డీఎస్పీ రామకృష్ణ, ఎ.వి.స్వరూప్, త్రీటౌ¯ŒS సీఐ శ్రీరామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.   

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top