‘ప్రొజేరియా’ బ్రాండ్ అంబాసిడర్ మృతి

‘ప్రొజేరియా’ బ్రాండ్ అంబాసిడర్ మృతి


సుల్తానాబాద్: కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామానికి చెందిన బీట్ల నేహాల్(15) ప్రొజేరియా వ్యాధితో మంగళవారం వేకువజామున మరణించాడు. అమెరి కాలోని ప్రొజేరియా రీసెర్చ్ ఫౌండేషన్  నేహా ల్‌ను ప్రొజేరియాకు ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. బీట్ల శ్రీనివాస్-శ్రీదేవిల కుమారుడైన నేహాల్ మూడేళ్ల వరకు అందరు పిల్లల్లానే ఆరోగ్యంగానే ఉన్నాడు. తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం 15 ఏళ్ల క్రితమే మహారాష్ట్రలోని భివండికి వెళ్లారు. శ్రీనివాస్ మొబైల్ రిపేర్స్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. నేహాల్ అనారోగ్యం బారిన పడడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించగా, వ్యాధి నిర్ధారణ కాలేదు.



అప్పటినుంచి పలు ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం కనిపించలేదు. చివరకు 2014లో వైద్యుల సూచన మేరకు ముంబైలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)లో చూపిం చారు. అక్కడ డాక్టర్ పరక్ తరహంకర్ పరీ క్షించి ప్రొజేరియా వ్యాధిగా నిర్ధారించారు. జన్యు సంబంధ సమస్యలతోనే ఈ వ్యాధి వస్తుందని తెలిపారు. ఇలాంటివారు ఎండలో తిరగకూడదు. ఎప్పుడూ ఏసీలోనే ఉండాలి. ఎముకలు పెలుసుగా ఉండి, చిన్నవయసులోనే ముసలితనం వచ్చినట్లుగా మారడం ఈ వ్యాధి లక్షణం. ప్రపంచంలోనే ఈ వ్యాధిగ్రస్తులు 134 మంది ఉండగా ఇండియాలో గుర్తించిన నలుగురిలో మొదటివాడు నేహాలే.



అమెరికాలోని ప్రొజేరియా రీసెర్చ్ ఫౌండేషన్ ఈ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా సేవ చేయడమే కాకుండా వ్యాధి నయం చేసేందుకు రూ.3 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడింది. అమెరికాలోని లెల్లెగారెడ్డన్ అనే డాక్టర్ సంరక్షణలో నేహాల్‌కు వైద్యసేవలందిస్తున్నారు. 15 ఏళ్ల వయసులోనూ నేహాల్ బరువు 13 కిలోలకు మించలేదు. ఇటీవల తన బాబాయి కూతురు పెళ్లి ఉండడంతో స్వగ్రామం పూసాలకు నేహాల్‌తోపాటు కుటుంబం వచ్చింది. సోమవారం ఎండతీవ్రత అధికంగా ఉండడంతో అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలు చేసుకోగా, కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.



 తల్లిదండ్రుల సూచన మేరకు కరీంనగర్ వైద్యులు ముంబైలో నేహాల్‌కు చికిత్స అందిం చే వైద్యులను ఫోన్లో సంప్రదించారు.  ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి మంగళవారం వేకువజామున నేహాల్ మృతిచెందాడు. స్వగ్రామం పూసాలలో అంత్యక్రియలు నిర్వహించారు. నేహాల్ కోరికల్లో అమిర్‌ఖాన్‌ను కలుసుకోవడం, హోండా హహియో కారులో తిరగడం, లాంబోగిని స్పోర్ట్స్ కారులో తిరగడం తీరాయి. చివరి కోరిక డీజీ లాండ్‌లో తిరగాలని ఉందని చెప్పేవాడు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top