ఈ ఆఫీసు బహుదూరం

ఈ ఆఫీసు బహుదూరం


సింగిల్ డిజిట్‌కే పరిమితమైన పదిశాఖలు

  ప్రతివారం ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నా పురోగతి నామమాత్రం


ఒంగోలు టౌన్ : ఈ-ఆఫీసుకు కొన్నిశాఖలు దూరంగా ఉంటున్నారుు. మొక్కుబడిగా కార్యకలాపాలు సాగిస్తుండటంతో జిల్లాపై తీవ్రప్రభావం చూపుతోంది. అన్ని శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు ఈ-ఆఫీసు ద్వారానే చేపట్టాలని కలెక్టర్ సుజాతశర్మ, జారుుంట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఆ శాఖాధికారుల్లో పూర్తిస్థారుులో స్పందిస్తున్న దాఖలాలు కనిపించడంలేదు. ఈ-ఆఫీసుపై జారుుంట్ కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి వారం వారం సమీక్షిస్తున్నప్పటికీ ఆశించిన స్థారుులో ఫలితాలు రావడం లేదు. దీనిలో ప్రకాశం జిల్లా ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. మొక్కుబడిగా వ్యవహరిస్తున్న ఆ పది శాఖలతోపాటు ఇతర శాఖలు కూడా లైట్‌గా తీసుకుంటే ప్రకాశం జిల్లా దిగువ స్థానానికి పడిపోయే ప్రమాదం ఉంది.  



ఐదు నెలలైనా అంతే సంగతులు...

జిల్లాలో ఈ ఏడాది జూలై నుంచి ఈ-ఆఫీసును అమలు చేస్తున్నారు. అంతకు ముందుగానే కలెక్టరేట్‌ను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి కార్యకలాపాలు సాగించారు. ఆ తరువాత మొదటి విడతలో 10శాఖలను చేర్చారు. అనంతరం రెండో విడతలో మరో 72 శాఖలను ఈ-ఆఫీసులో చేర్చారు. రోజుకు 100 నుంచి 135 వరకు ఈ-ఆఫీసు ద్వారా ఫైల్స్ నిర్వహణ ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో 82 శాఖల్లో ఈ-ఆఫీసు అమలవుతోంది. ఇప్పటివరకు ఈ-ఆఫీసు ద్వారా 10,250 ఫైల్స్‌కు సంబంధించిన కార్యకలాపాలు సాగారుు. పూర్తిస్థారుులో అన్ని శాఖలు ఈ-ఆఫీసు ద్వారా కార్యకలాపాలు సాగిస్తే ప్రకాశం జిల్లా రాష్ట్రస్థారుులో మొదటి మూడు స్థానాల్లో నిలిచేది. అరుుతే, కొన్ని శాఖల పనితీరు చూస్తుంటే జిల్లా ర్యాంకు కిందకు దిగజారే ప్రమాదం పొంచి ఉంది.



కారణాలు అనేకం...

ఈ-ఆఫీసుకు సంబంధించి కొన్ని శాఖలు వెనుకబడటానికి కారణాలు అనేకం ఉన్నారుు. ఆయా శాఖలకు సంబంధించి పూర్తిస్థారుులో మ్యాన్ పవర్(సిబ్బంది) లేకపోవడం ఒక కారణమైతే, సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు స్కాన్‌చేసి పంపడం ఇంకో కారణం. కొన్ని సందర్భాల్లో దాదాపు 100 నుంచి 200 పేజీల వరకు స్కానింగ్ చేసి ఈ-ఆఫీసుకు పంపించడం కష్టతరమవుతోంది. అదేవిధంగా స్కానర్ల సమస్య కూడా కొన్ని శాఖలను పట్టిపీడిస్తోంది. ఈ-ఆఫీసు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ వాటికి సంబంధించిన స్కానర్లు మాత్రం పూర్తిస్థారుులో అందించలేదు. సంబంధిత శాఖలే స్కానర్లు కొనుగోలు చేసుకుని ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లడంతో వాటిని ఏ విధంగా కొనుగోలు చేయాలో తెలియక కొంతమంది రోజుల తరబడి ఈ-ఆఫీసు వారుుదా వేసుకుంటూ వచ్చారు. అన్ని శాఖలు తమకు సంబంధించిన బడ్జెట్‌లో స్కానింగ్ మిషన్‌లు కొనుగోలు చేయాలని ఆదేశాలు వెళ్లినప్పటికీ నామమాత్రపు బడ్జెట్‌లకు పరిమితమైన శాఖాధికారులు వాటిని కొనుగోలు చేసేందుకు ముం దుకు రాకపోవడంతో ఈ-ఆఫీసు కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది.



టాప్ టెన్‌లో కొన్ని శాఖలు...

జిల్లాలో ఈ-ఆఫీసుకు సంబంధించి రెవెన్యూ, జిల్లాపరిషత్, డ్వామా, పౌరసరఫరాలశాఖ, డీఆర్‌డీఏ, వ్యవసాయశాఖ, జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ, ట్రెజరీ, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్, చీరాల మున్సిపాలిటీ టాప్‌టెన్‌లో ఉన్నారుు. వీటితోపాటు కనిగిరి, కందుకూరు, అద్దంకి మున్సిపాలిటీల్లో కూడా ఈ-ఆఫీసుకు సంబంధించిన కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నారుు. ఈ శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతూ ఉంటా రుు. దాంతో ఈ-ఆఫీసులో అవి ముందంజలో ఉన్నారుు. అరుుతే ఆ శాఖలు మరింత మెరుగ్గా వ్యవహరించాల్సి ఉంది. ఆ దిశగా సంబంధిత జిల్లా అధికారులు వేగవంతం చేస్తే కొంతమేర ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నారుు.

 

 సింగిల్ డిజిట్స్ శాఖలు...

 జిల్లాలో పది శాఖలు ఈ-ఆఫీసుకు సంబంధించి సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారుు. ఆ శాఖల పనితీరు కారణంగా రాష్ట్రస్థారుులో జిల్లా స్థానంపై ప్రభావం కనిపిస్తోంది. మెప్మా, కార్మికశాఖ, జిల్లా ఉపాధి కార్యాలయం, ఎస్‌ఈ కన్‌స్టక్ష్రన్‌‌స, ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్ కార్యాలయం, సమాచార పౌరసంబంధాల అసిస్టెంట్ డెరైక్టర్ కార్యాలయం, జిల్లా యువజన సంక్షేమశాఖ, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్, గిద్దలూరు అటవీశాఖ కార్యాలయం, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలు సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారుు. ఈ శాఖలకు సంబంధించిన కార్యకలాపాలను ఈ-ఆఫీసు ద్వారా తక్కువగా పంపిస్తుండటంతో డబుల్ డిజిట్స్‌కు కూడా చేరుకోలేకపోతున్నారుు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top