పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన డీఐజీ


నాంపల్లి : స్థానిక పోలీస్‌స్టేషన్‌ను డీఐజీ అకున్ సభర్వాల్ మంగళవారం సందర్శించారు. స్టేషన్ పనితీరును, రికార్డులను, భవనాన్ని పరిశీలించారు. ముందుగా డీఐజీకి సిబ్బంది గౌరవ వందనం చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. సిబ్బంది పనితీరు, వారి సామగ్రి, వ్యక్తిగత ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పనితీరు,  పరిసరాలను ఉంచినందుకు స్థానిక సీఐ బాలగంగిరెడ్డి, ఎస్‌ఐ ప్రకాశ్‌రావును ప్రత్యేకంగా అభినందించారు. 23 సంవత్స

 

 రాల క్రితం నిర్మించిన స్టేషన్, సిబ్బంది క్వార్టర్స్ శిథిలావస్థల్లో ఉండి సిబ్బంది నివాసానికి ఇబ్బందిగా ఉన్నందున్న నూతన భవనం నిర్మాణానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, డీఎస్పీ చంద్రమోహన్, ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, సీఐలు గిరిబాబు,  బాలగంగిరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, శివరాంరెడ్డి, ఎస్‌ఐలు ఖలీల్‌ఖాన్, సర్ధార్, శంకర్‌రెడ్డి, శేఖర్, రాఘవేందర్, సతీష్, కాంత్రికుమార్, ప్రకాశ్‌రావు, నాగభూషన్‌రావు, రాము , ఏఎస్‌ఐ దివంతరావు, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌రాజు, సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. 

 

 సీఐ కార్యాలయంపై ఆరా...

 నాంపల్లి సర్కిల్ కార్యాలయం స్థానికంగా లేకుండా పక్క మండలం మర్రిగూడలో ఎందుకు ఉందని డీఐజీ అకున్ సభర్వాల్ ఆరా తీశారు. కొన్ని సంవత్సరాలుగా స్థానికంగా క్వాటర్స్, కార్యాలయ భవనం లేక పోవడంతో మర్రిగూడలోనే కొనసాగుతుందని స్థానిక సిబ్బంది తెలిపారు. దాంతో ఈ సమస్యపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.   

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top