ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట

ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట - Sakshi


► 35 దుంగలు స్వాధీనం, ముగ్గురి అరెస్ట్‌



నెల్లూరు సిటీ : ఎర్రచందనం అక్రమ రవాణాకు కొందరు కొత్త ఎత్తులు వేస్తున్నారని, వారి ఎత్తులను చిత్తు చేస్తూ జిల్లా పోలీస్‌ యంత్రాంగం అడ్డు కట్ట వేస్తుందని జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ అన్నారు. నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో విశాల్‌గున్నీ మాట్లాడారు. గత ఒకటిన్నర సంవత్సరంగా ఎర్రచందనం అక్రమ రవా ణాను పూర్తిస్థాయిలో అరికట్టగలిగామని తెలిపారు. వెంకటగిరి, డక్కిలిలో బుధ, గురువారాల్లో ఎర్ర చం దనం తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నట్లు తెలిపారు.



ఈ నెల 22న వల్లివేడు చెరువు వద్ద వెళ్తున్న వాటర్‌ ట్యాంకర్‌ను తనిఖీలు చేయగా అందులో రూ.6.80 లక్షలు విలువ చేసే 24 ఎర్రచందనం దుంగలు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ రవాణాలో సూత్రధారి పారె మురళీ,  గోనుగొడుగు రమేష్‌ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మురళీపై గతంలో అనేక కేసులు ఉన్నాయన్నారు. రౌడీషీట్‌ కూడా ఉన్నట్లు తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తున్నట్లు తెలిపారు. 23న డక్కిలి మండలం చీకిరేనిపల్లి చెరువు వద్ద ఎర్రచందనాన్ని ట్రాక్టర్‌లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో రూ.3.10 లక్షలు విలువ చేసే 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, సుధారాసి మునేంద్రను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. వీరికి సహకరించిన వాళ్లు పరారీలో ఉన్నారని, వాళ్లను ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నట్లు తెలిపారు.  ఈ రెండు కేసుల్లో అతి చాకచక్యంగా నిందితులను పట్టుకున్న గూడూ రు ఇన్‌చార్జ్‌ డీఎస్పీ శ్రీనివాసాచారి, వెంకటగిరి సీఐ మద్ది శ్రీనివాసులు, వెంకటగిరి ఎస్సై కొండపనాయుడు, సిబ్బందికి రివార్డులు అందజేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top