భువనేశ్వర్ వెళ్లిన ప్రధాని


సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్రమోదీ శనివారం రాత్రి విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ బయలుదేరి వెళ్లారు. రాత్రి 10.30 గంటలకు ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు వీడ్కోలు పలికారు. ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు ఆయన తిరిగి విశాఖ వస్తారు. ఆర్కే బీచ్‌లో నౌకాదళ విన్యాసాలు ముగిసిన అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు.



 రాష్ర్టపతి విందు: ఐఎఫ్‌ఆర్ 2016కు హాజరైన దేశ విదేశీ నౌకాదళ ప్రతినిధులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం రాత్రి గౌరవ విందు ఇచ్చారు. విశాఖ నేవల్‌బేస్‌లోని ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, నౌకాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్‌కె ధోవన్, వైస్ అడ్మిరల్ సతీష్‌సోనీ, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



 ఐఎఫ్‌ఆర్ స్టాంప్ ఆవిష్కరణ: ఐఎఫ్‌ఆర్ 2016 జ్ఞాపకార్థం తపాలా శాఖ రూపొందించిన స్టాంపును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. విశాఖలోని నేవల్ బేస్‌లో శనివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో ఈ స్టాంపును విడుదల చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top