‘కూచిపూడి’ని కాపాడాలని...

‘కూచిపూడి’ని కాపాడాలని...

 

ఢిల్లీ సంస్థ ఆధ్వర్యంలో

భామా కలాపాం షూటింగ్‌ 

కూచిపూడి : 

అంతరించిపోతున్న కళలను కాపాడడానికి, అలాగే భావితరాలకు అందచేయటానికి ఢిల్లీకి చెందిన న్యూస్‌ వరల్డ్‌ ఆఫ్‌ ఇండియా అనే సంస్థ దేశంలోని 15 పురాతన కళలపై డాక్యుమెంటేషన్, కాఫీ టేబుల్‌బుక్‌ ప్రచరణకు కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు రమణ్‌  తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం కూచిపూడి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో 14వ శతాబ్ధంలోని సిద్ధేంద్రుడు రచించిన  భామా కలాపం నృత్యరూపకాన్ని డాక్యుమెంటేషన్‌ రూపంలో నిర్మిస్తున్నారు. ఇందులో బిస్మిల్లా ఖాన్‌యువ పురస్కార అవార్డు గ్రహీత వేదాంతం వెంకట నాగ చెలపతి సత్యభామగా, సూత్రధారునిగా పసుమర్తి రత్తయ్య శర్మ ప్రదర్శించారు. వీరికి పసుమర్తి హరినాధ శర్మ హరినాధ శాస్త్రి మృదంగంపై, పాలపర్తి అంజనేయులు వయోలిన్‌ పై, పసుమర్తి పాపని ఆత్రంతో సహకరించారు. 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top