డంపింగ్‌ యార్డుల నిర్మాణానికి స్థల సేకరణ


ఒంగోలు రూరల్‌: జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్వచ్చ భారత్‌లో భాగంగా గ్రామాల్లో సాలీడ్‌ వెల్త్‌ ప్రోసెసింగ్‌ సెంటర్‌లను నిర్మించేందుకు మండల స్థాయి అధికారుల నియామకం జరిగింది. గ్రామ పంచాయతీల్లో సాలీడ్‌ వేస్టు మేనేజ్‌మెంట్‌ విధానం ద్వారా పారిశుధ్యం, ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డుల నిర్మాణానికి మండల స్థాయి అధికారులను నియమించారు. మండలంలోని ఎంపీడీఓ, ఈఓఆర్డి, డ్వామా ఏపీఓ, ఏపీఎం డీఆర్‌డీఏ, ఏఈఈపిఆర్, ఏఈఈఆర్‌డబ్ల్యూఎస్‌ నియామకం జరిగింది. జిల్లాలోని అన్ని మండలాల్లో మండల స్థాయి అధికారులు వారికి కేటాయించబడిన దత్తత గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణానికి కృషిచేయాలనీ ఆదేశించారు. దీనికోసం వెంటనే తగు చర్యలు తీసుకోవాలనీ ఆదేశించారు.



గ్రామ పంచాయితీలో సాలీడ్‌వెల్త్‌ ప్రొసెసింగ్‌ నిర్మాణం కొరకు కావలసిన స్థల సేకరణ గుర్తించి స్థానిక పంచాయితీ కార్యదర్శి, సర్పంచ్‌ సహకారంతో మండల తహసీల్దార్‌ ద్వారా 31.03.2017లోగా స్థల సేకరణ పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఒంగోలు మండలంలో ఎంపీడీఓ ఎం.వెంకటేశ్వరావు ఉలిచి గ్రామాన్ని, ఈఓఆర్డి పిఆర్‌ బాలచెన్నయ్య వలేటివారిపాలెం, ఏపీఓ కె.నాగరాజు యరజర్ల, ఏపీఎం ఐకెపి కె.విజయకుమారి సర్వేరెడ్డిపాలెం, ఏఈఈపిఆర్‌ ఎంవి శివప్రసాదరావు చేజర్ల, ఏఈఈ ఆర్డ్‌బ్ల్యూఎస్‌ సతీష్‌చంద్ర దేవరంపాడు దళితవాడ నియామకం జరిపారు. వీరు ఈ నెల 31లోగా డంపింగ్‌ యార్డు స్థల సేకరణ పూర్తి చేసి జిల్లా కలెక్టర్‌ పంచాయితీ రాజ్‌ విభాగానికి సమాచారం అందజేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top