డ్రోన్తో భూ సర్వే

డ్రోన్తో భూ సర్వే - Sakshi


ఫార్మాసిటీ భూముల్లో సర్వే ముమ్మరం

ప్రైవేటు ఏజెన్సీ ద్వారా డ్రోన్ సర్వే

హద్దులను గుర్తిస్తున్న టీఎస్‌ఐఐసీఓ


ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం కందుకూరు, యాచారం మండలాల్లో తీసుకోవడానికి నిర్ణయించిన 10 వేల ఎకరాల్లో టీఎస్‌ఐఐసీ సంస్థ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా డ్రోన్ సర్వే చేయిస్తోంది. ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసుకున్న కందుకూరు - యాచారం మండలాల్లోని ముచ్చర్ల, మీరాఖాన్‌పేట, పంజగూడ, కుర్మిద్ద తదితర గ్రామాల్లో సర్వే పూర్తి చేసిన ఏజెన్సీ ప్రతినిధులు గురువారం నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోని 184, 213, 247 తదితర సర్వే నంబర్లల్లో సర్వే చేశారు. రిమోట్‌తో డ్రోన్ (చిన్న విమానం) ను భూములపైకి పంపించి ఆ భూముల్లో రాళ్లు, గుట్టలు, చెరువులు, కుంటలు, అటవీశాఖ భూములను సర్వే చేశారు.


యాచారం : ప్రభుత్వం ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం తీసుకోవా లనుకున్న భూముల్లో టీఎస్‌ఐఐసీఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా డ్రోన్ సర్వే చేయిస్తోంది. కందుకూరు - యాచారం మండలాల్లోని పలు గ్రామాల్లో 10 వేల ఎకరాలకు పైగా అసైన్డ్, పట్టా భూములను తీసుకున్న టీఎస్‌ఐఐసీఓ.. ఇప్పటికే రెండు వేల ఎకరాలకు పైగా అర్హులైన రైతులకు పరిహారం చెక్కులను కూడా పంపిణీ చేసింది.   తాజాగా మిగిలిన భూముల్లో సాంకేతిక పరంగా సర్వేలు చేయిస్తోంది. ఇప్పటికే కందుకూరు - యాచారం మండలాల్లోని ముచ్చర్ల, మీరాఖాన్‌పేట, పంజగూడ, కుర్మిద్ద తదితర గ్రామాల్లో ఏజెన్సీ ప్రతినిధులు సర్వే పూర్తి చేశారు.


గురువారం నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోని 184, 213, 247 తదితర సర్వే నంబర్లలో రిమోట్ సాయంతో డోన్ (చిన్న విమానం)ను ఉపరితలంపైకి పంపించి ఆ భూముల్లో రాళ్లు, గుట్టలు,  చెరువులు, కుంటలు, అటవీశాఖ భూములను సర్వే చేయించారు. డ్రోన్ ప్రతిసారి రెండు కిలోమీటర్లకు పైగా దూరం వెళ్లీ ఆ భూముల హద్దులను తన కెమెరాలో రికార్డు చేసింది. సాంకేతిక సిబ్బంది డ్రోన్ తిరుగుతున్న ప్రదేశాన్ని ల్యాప్‌టాప్‌ల్లో చూస్తూ రికార్డు చేశారు. ఇదే విషయమై టీఎస్‌ఐఐసీఓ ప్రతినిధి పద్మజను సంప్రదించగా ఫార్మాసిటీ కోసం తీసుకోనున్న భూ ముల్లో అటవీ భూముల హద్దులు, అసైన్డ్, పట్టా భూముల హద్దులు తెలుసుకోవడానికి ఈ సర్వే చేయిస్తున్నట్లు ఆమె తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top