మారేదెన్నడు..సమస్య తీరేదెప్పుడు?

మారేదెన్నడు..సమస్య తీరేదెప్పుడు?


► చెత్త వేస్తుండడంతో నిండుతున్న జౌళి నాల

►ఎన్నిసార్లు పనులు చేపట్టినా అదే తీరు

►ఇబ్బంది పడుతున్న చుట్టు పక్కల ప్రజలు

► పట్టించుకోని అధికారులు




నిర్మల్‌ టౌన్ : జిల్లాకేంద్రం నుంచి వెళ్లే జౌళినాల పూడికతో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు పలుమార్లు జౌళినాల పూడికను తీసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. అందులో చెత్తను వేస్తుండడంతో మళ్లీ పూడకతో నిండిపోతున్నాయి. సరైన మురుగుకాలువ వ్యవస్థ లేకపోవడంతో చుట్టుపక్కల ఇళ్ల నుంచి మురుగునీరు సైతం ఇందులోకే చేరుతోంది. అందులోనే చెత్తను వేయడంతో మరింత అధ్వాన్నంగా తయారైంది. దీనిలోని పూడికను తీయడానికి మున్సిపల్‌ ఆధ్వర్యంలో పలుమార్లు పనులు చేపట్టినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.  



ఎన్నిసార్లు పనులు చేపట్టినా...

జౌళినాల పూడికతీత పనుల కోసం ఇప్పటి వరకు పలుమార్లు ప నులు చేపట్టారు. పని అయిపోయిందనిపించారే తప్ప పూడికతీ తను పూర్తిస్థాయిలో తీయడంలో మున్సిపల్‌ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. లక్షల రూపాయలు వె చ్చించి పూడికతీత పనులను చేపట్టినా ప్రయోజనం ఉండడం లే దు. ఇంతకుముందు పనులు చేపట్టినప్పుడు జౌళినాలలోనే ఓ ప క్కకు తొలగించిన పూడికను అలాగే ఉంచారు. దీంతో అది మళ్లీ అందులోనే పడడంతో సమస్య మొదటికి వస్తోంది. దీనికి తోడు జౌళినాలల్లో పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోయాయి. దీంతో మురికినీ రు వెళ్లేందుకు దారిలేక అలాగే నిలిచిఉంటోంది.



పారిశుధ్యం కరువు...

జౌళినాల పట్టణంలోని విశ్వనాథ్‌పేట్, నాయిడివాడ, బేస్తవార్‌పేట్, సోమవార్‌పేట్, కాల్వగడ్డ, కురాన్నపేట్‌ల మీదుగా పోతోంది. ఇంతకుముందు జౌళినాలలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేది. కానీ స్వర్ణ నుంచి నీరు రావడంలో అడ్డంకులు ఏర్పడడంతో నీటిపారకం నిలిచిపోయింది. అప్పటి నుంచి చుట్టుపక్కల ఇళ్ల నుంచి మురుగునీటిని అందులోనే వదులుతున్నారు.  దీంతో విపరీతంగా దుర్గంధం వ్యాపిస్తోంది.



ఇబ్బందుల్లో ప్రజలు...

జౌళినాల నుంచి దుర్గంధం వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం కాలనీలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. కొన్ని చోట్ల జౌళినాలలను ఆక్రమించుకుని ఇళ్లను నిర్మించుకోవడంతో మురుగునీరు పోవడానికి సరైన స్థలం లేకుండా పోయింది.  మురుగునీరు ఇళ్లల్లోకి వచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులతోనే పాలకవర్గం నెట్టుకొస్తున్నారు. దీనివల్ల నిధులు ఖర్చవుతున్నా, సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. శాశ్వత ప్రాతిపదికన పనులు నిర్వహిస్తేనే తగిన ఫలితం ఉంటుంది.ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top