నిరీక్షణ!

నిరీక్షణ!


బ్యాంకుల్లో తగ్గని రద్దీ

అరకొర సేవలతో ఏటీఎంలు

తగ్గని జనం ఇబ్బందులు


కరీంనగర్ బిజినెస్ : ల్లో నగదు కోసం ఖాతాదారుల కష్టాలు ఏమాత్రం తగ్గడం లేదు. నగదు మార్పిడి నిలిపివేతతో రద్దీ కొద్దిగా తగ్గిన క్యూలైన్‌లో నిరీక్షణ మాత్రం తప్పడం లేదు. ఏటీంఎంలు పూర్తి స్థారుులో పనిచేయడం లేదు. పనిచేసిన చోట్ల గంటల్లోనే డబ్బు ఖాళీ అవుతుండడంతో డబ్బులందని వారు నిరాశతో వె నుదిరుగుతున్నారు. ప్రైవేట్ బ్యాంకుల ఏటీఎంలు తెరుచుకోవడం లేదు. బ్యాంకుల్లోకి నగదు కొంత సమకూరడంతో సోమవారం పరిస్థితి కాస్త కుదుటపడింది. ఇన్ని రోజులు రూ.ఆరు వేల వరకు చెల్లింపులు చేసిన బ్యాంకు లు రూ.పదివేలకు పెంచారుు. ఒకటో తేదీ సమీపించడంతో చాలా బ్యాంకులు ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొ ని  ప్రత్యేకంగా నగదును పక్కనపెట్టినట్లు తెలిసింది. మరికొన్ని బ్యాంకుల్లో అత్యవసరం ఉండి అధికారులతో మొరపెట్టుకున్న వారికి రూ.10వేల వరకు చెల్లింపులు చేశారు.   గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల సేవలు మెరుగుపడలేదు. గంటల తరబడి క్యూలో నిలుచున్నా అరకొరగానే చెల్లింపులు జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరాలలో బ్యాంకులు, ఏటీఎంల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అదే గ్రామీణ ప్రాంతా ల్లో వాటి సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రజల కనీస అవసరాలు తీరడం లేదని తెలుస్తుంది. ఏటీఎంలలో కేవలం రెండు వేల నోట్లు రావడంతో చిల్లర కష్టాలు తప్పడం లేదు. కొత్త రూ.500 నోట్ల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. పాత వెరుు్య నోట్లున్న వారు చేసేదేమి లేక బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top